అమరావతి రాజధానిలో అత్యాధునిక హంగులతో కొలువుదీరిన సీఆర్‌డీఏ (CRDA) ప్రధాన కార్యాలయం ఉద్యోగుల పాలిట 'అందని ద్రాక్ష'లా మారింది. విజయవాడలో ఉన్న కార్యకలాపాలను పూర్తిగా అమరావతికి తరలించిన ప్రభుత్వం, ఉద్యోగుల రాకపోకల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు నగరం నుంచి తుళ్లూరు మీదుగా వచ్చే ఉద్యోగుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. సీఆర్‌డీఏతో పాటు మున్సిపల్ శాఖ, టీఐడీసీఓ (TIDCO), స్వచ్ఛ ఆంధ్ర, టౌన్ ప్లానింగ్ వంటి కీలకమైన 11 విభాగాలు ఇక్కడే ఉండటంతో ఉద్యోగుల సంఖ్య వేలల్లో ఉంది. అయితే, ఈ స్థాయిలో సిబ్బంది పెరిగినా ఆర్టీసీ నుంచి ఆశించిన స్థాయిలో బస్సు సర్వీసులు అందుబాటులోకి రాలేదు. గుంటూరు-తుళ్లూరు మార్గంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నామమాత్రంగానే ఉండటంతో ఉద్యోగులు విధిలేని పరిస్థితుల్లో సొంత వాహనాలపై ఆధారపడుతున్నారు. ఉదయం కార్యాలయానికి చేరుకోవాలన్నా, సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లాలన్నా బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఇది కేవలం సమయానికే కాదు, అదనపు ఆర్థిక భారానికి కూడా దారితీస్తోంది. మహిళా ఉద్యోగులు, వృద్ధ సిబ్బందికి ఈ ప్రయాణం మరీ భారంగా మారింది. రాజధాని అభివృద్ధికి అహర్నిశలు శ్రమించే సిబ్బందికి కనీస రవాణా సౌకర్యం కల్పించకపోవడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది.

కేవలం ఉద్యోగులకే కాకుండా, వివిధ ప్రభుత్వ పనుల నిమిత్తం మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య ప్రజలకు సైతం ఈ రవాణా కష్టాలు తప్పడం లేదు. 11 శాఖలు ఒకే చోట ఉండటం వల్ల పని త్వరగా పూర్తవుతుందని వస్తున్న ప్రజలు, సరైన బస్సులు లేక గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. గుంటూరు నుంచి సీఆర్‌డీఏ వయా తుళ్లూరు మీదుగా ఆల్ ఎంప్లాయిస్ బస్ ఉదయం సాయంత్రం వేళలో ఒకసారి మాత్రమే సర్వీసులు నడుపుతోందని ఉద్యోగులు చెప్తున్నారు. అలాగే గుంటూరు నుంచి సీఆర్‌డీఏ భవనానికి వయా రెయిన్ ట్రీ పార్క్ బస్సు ఉన్నా అది సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆటోలు కూడా అందుబాటులో లేవని.. ప్రభుత్వం తక్షణమే స్పందించి గుంటూరు - తుళ్లూరు - సీఆర్‌డీఏ కార్యాలయం మార్గంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజధాని వేగంగా అభివృద్ధి చెందాలంటే, ముందుగా అక్కడ పనిచేసే యంత్రాంగానికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం అత్యవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos