“క్వాంటం టాక్ బై సీఎం సీబీఎన్” కార్యక్రమంలో సీఎం చంద్ర‌బాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. క్వాంటం టెక్నాలజీ, భారత విజ్ఞాన చరిత్ర, దేశ-రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక దిశపై సమగ్రంగా వివరిస్తూ, అమరావతిని భారత క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజెంటేషన్ ద్వారా క్వాంటం ప్రోగ్రామ్‌లోని కీలక అంశాలను వివరించిన సీఎం, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 25 ఏళ్ల క్రితమే ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేసిన చంద్రబాబు, అదే తరహాలో ఇప్పుడు క్వాంటం రంగంలోనూ ముందడుగు వేస్తున్నామని చెప్పారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉన్నట్లే, భారత్‌కు క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. విజ్ఞానం భారతీయుల డీఎన్ఏలోనే ఉందని, క్రీస్తుపూర్వం 2500 నాటికే అర్బన్ ప్లానింగ్, జీరో ఆవిష్కరణ, అడ్వాన్స్డ్ అస్ట్రానమీ వంటి రంగాల్లో భారత్ ప్రపంచానికి దారి చూపిందని వివరించారు. ఒకప్పుడు ప్రపంచ జీడీపీలో 40 శాతం వాటా భారత్‌దేనని, ‘బంగారు పిచ్చుక’గా పేరొందిన దేశం ఇప్పుడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం తర్వాత టెక్నాలజీ ఆధారిత సేవల రంగంలో భారత్ విప్లవం సాధించిందని చెప్పారు. గూగుల్‌కు సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌కు సత్య నాదెళ్ల, ఐబీఎంకు అరవింద్ కృష్ణ వంటి భారతీయులే నాయకత్వం వహించడం దేశ ప్రతిభకు నిదర్శనమన్నారు. ఏపీ అభివృద్ధి ప్రణాళికలను వివరించిన సీఎం, అమరావతిని నాలెడ్జ్ ఎకానమీ, క్వాంటం వ్యాలీగా, తిరుపతిని స్పేస్ సిటీగా, విశాఖను డేటా సెంటర్ల గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో అమరావతిలోనే క్వాంటం కంప్యూటింగ్ పరికరాల ఉత్పత్తి ప్రారంభిస్తామని, లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేయడమే లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే క్వాంటం స్కిల్ ప్రోగ్రామ్‌కు 54 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం యువత ఆసక్తికి నిదర్శనమన్నారు.

క్వాంటం కంప్యూటింగ్ వైద్యం, విద్యుత్, వ్యవసాయం, వాతావరణ అంచనాలు, మెటీరియల్స్ డిస్కవరీ వంటి రంగాల్లో మానవాళికి విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని చెప్పారు. ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించిన విష‌యాన్ని గుర్తు చేసిన సీఎం.. క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు ఇస్తామ‌న్నారు. 'ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్'ను భారతీయులు అందిపుచ్చుకోవాలని, ఏపీ ఏ టెక్నాలజీ విప్లవానికైనా నాయకత్వం వహిస్తుందన్నారు. విద్యార్థులు ఈ విజన్‌ను అందిపుచ్చుకుంటే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos