రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదంటూ సీబీఐ అధికారులు ఏకంగా సుప్రీంకోర్టుకు నివేదిక అందించిన తరువాత వరుసగా దాడుల ఘటనలు సంభవిస్తోన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు అంబటి రాంబాబ, జోగి రమేష్, విడదల రజినిపై జరుగుతోన్న దాడులు దీనికి ఉదాహరణ. అంతకుముందు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిపైకీ దాడులకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తెరమీదికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ముద్రగడ ఆరోపించారు. దీన్ని- రాక్షస, విధ్వంసకర పాలనగా అభివర్ణించారు. దమనకాండ కన్నా రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించాలని ప్రధానమంత్రిని కోరాలని చంద్రబాబుకు సూచించారు. ఎమర్జెన్నీని విధించడం ద్వారా ప్రతిపక్షాన్ని చంద్రబాబు పదవీ కాలం ముగిసేంత వరకు జైలులో పెట్టడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రులు విడదల రజనీ, అంబటి రాంబాబు, జోగి రమేష్ పై దాడులు చేయడం ఎంత వరకూ న్యాయమని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితులు లేవని ముద్రగడ పేర్కొన్నారు.

తిరుమల లడ్డూలో నెయ్యిలో కల్తీ జరగలేదని సీబీఐ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో గతంలో చంద్రబాబు చెప్పింది పచ్చి అబద్దమని తేలిపోవడం వల్ల అ అబద్దాన్ని కప్పి పుచ్చుకోవడానికి, దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ దాడులు జరుగుతున్నట్లు భావిస్తున్నానని అన్నారు. ఒక అబద్దానికి 100 అబద్దాలు చెప్పినా సరి చేయలేమని హితవు పలికారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చెప్పిన అబద్ధానికి ఆయన, టీడీపీ ఎంతో నష్ట పోయిందని ముద్రగడ అన్నారు. కల్తీ గురించి తాను గతంలో చెప్పింది పొరపాటు అని ఒప్పుకొని ఉంటే చాలా బాగుండేదని, చంద్రబాబు మీద గౌరవం పెరిగేదని చెప్పారు. చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారని, తనపై జరిగిన దాడి తరహాలోనే అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారని ముద్రగడ గుర్తు చేశారు.

కాపు కులానికి రిజర్వేషన్లు కల్పిస్తానని చంద్రబాబు మొండి చేయి చూపించిన విషయం అందరికి తెలిసిందేనని, ఉపముఖ్యమంత్రిపై ఉన్న ప్రేమతో కాపు సామాజిక వర్గం మొత్తం చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్లు అభిప్రాయపడుతున్నానని చెప్పారు. పవన్ కల్యాణ్ మద్దతు వల్లే చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు డీలా పడిపోయి టీడీపీ కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చారని, అయినప్పటికీ అదే కాపు కులం మీద రగిలిపోవడం సరికాదని ముద్రగడ అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos