ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచుగా బెంగళూరు నివాసంలోనే మకాం వేస్తుండటంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇవాళ షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ తాడేపల్లి కంటే బెంగళూరులోనే ఎందుకు మకాం వేస్తున్నారో ఆయన ఇవాళ బయటపెట్టారు. బెంగళూరులోనే జగన్ మకాం వేయడంపై అనేక అనుమానాలు వస్తున్నాయని యనమల రామకృష్ణుడు తెలిపారు. తన అవినీతి సంపదను జగన్ బెంగళూరు ప్యాలెస్ కు తరలించారన్నారు.

బెంగళూరు జగన్ జన్మస్థలం కాదని, సొంత నియోజకవర్గం కానే కాదని గుర్తుచేశారు. జగన్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా కాదని, కనీసం హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం కూడా కాదన్నారు. అలాంటప్పుడు జగన్ బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఎందుకు మకాం వేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్ బెంగళూరు కేంద్రంగానే అనేక కుట్రలకు తెర లేపారన్నారు నాడు వైఎస్ హయాంలో బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగానే అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా అవినీతి కార్యకలాపాలకు పాల్పడడం వల్లే జగన్ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయన్నారు. ఏడీఆర్ తాజా రిపోర్ట్ ప్రకారం జగన్ సహా వివిధ వైసీపీ కీలక నేతల ఆస్తులు ఉన్నట్టుండి 600 శాతం మేర పెరిగాయన్నారు. అవినీతి కారణంగానే ఆస్తులు అమాంతం పెరిగిపోయాయన్నారు.

జగన్, వైసీపీ నేతలు నియో రిచ్ క్లబ్ నుంచి వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్ లో చేరుతున్నారన్నారు. ఐదేళ్ల కాలంలో పోగేసిన అవినీతి సంపదతోనే జగన్ సహా వివిధ కీలక నేతల ఆస్తులు 600 శాతం మేర పెరిగాయని తెలిపారు. బడుగులను అణగదొక్కుతూ.. ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తున్నారని యనమల ఆరోపించారు. జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ వంటివి జగన్ అవినీతి పుత్రికలే అని యనమల ఆరోపించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos