ఏపీలో గతంలో ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపి ఇప్పుడు విపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పాత నిర్ణయాల్ని సమీక్షించుకుంటారా... గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారం చేజారిన తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఇద్దరు ప్రజాప్రతినిధుల్ని తిరిగి పార్టీలోకి తీసుకుంటారా.. అప్పట్లో రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీలో వాళ్ల మాటలు విని వీరిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తేస్తారా..  ఇవాళ అసెంబ్లీకి జగన్ తో పాటు ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు అనిపించడంతో ఇప్పుడు పలు అంశాలు చర్చకు వస్తున్నాయి.

గతంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఎంపికై, ఫామ్ లో ఉన్న సమయంలో అనూహ్యంగా డ్రైవర్ ను హత్య చేసిన కేసులో ఇరుక్కుని, జైలు జీవితం కూడా అనుభవించిన అనంతబాబుపై అప్పట్లో సస్పెన్షన్ వేటు పడింది. అప్పట్లో అధికారంలో ఉన్న జగన్.. విపక్షాల విమర్శలకు తోడు, సొంత పార్టీ నేతల ఒత్తిడితో ఈ వేటు వేశారు. అయితే అధికారికంగా వేటు పడినా అనంతబాబు మాత్రం వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. ఇవాళ కూడా జగన్ తో కలిసి ఆయన అసెంబ్లీలో నిరసనల్లో పాల్గొన్నారు.

అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. తన భార్య వాణిని వదిలేసి ప్రియురాలు దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్న క్రమంలో కుటుంబ విభేదాలు రోడ్డుకెక్కాయి. వాణి, తన కుమార్తెలతో కలిసి దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి చేసిన రచ్చ తర్వాత ఆయనపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తనపై శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన సోదరుల ఒత్తిడితోనే పార్టీ వేటు వేసిందని ఆయన కూడా పలుమార్లు చెప్పుకున్నారు. ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ అనూహ్యంగా జగన్ ను అసెంబ్లీకి వచ్చి కలిశారు. అసెంబ్లీ నుంచి వైసీపీ ప్రజాప్రతినిధులు బాయ్ కాట్ చేస్తున్న క్రమంలో జగన్ తో కలిసి ఏదో మాట్లాడుతూ ఆయన బయటికి వస్తుండటం కనిపించింది. ఈ రెండు పరిణామాలతో వీరిద్దరినీ తిరిగి పార్టీలోకి తీసుకుని కీలక బాధ్యతలు అప్పచెప్పేందుకు జగన్ సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos