అమెరికా, ఇజ్రాయిల్ -  ఇరాన్  మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం ఇండియాఫై ప్రభావం చూపుతోంది. కమర్షియల్ సిలిండర్ లపై  కేంద్రం ఆంక్షలు విధించడంతో హోటల్ రెస్టారెంట్ల యాజమాన్యాలు తీవ్ర  సంక్షోభంలోకి జారుకుంటున్నాం అంటున్నాయి. దీంతో ప్రభుత్వం ముందు  కీలక ప్రతిపాదనలు ఉంచడానికి రెడీ అవుతున్నాయి. విజయవాడలో సమావేశమైన  ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ముందుగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ లను తాత్కాలికంగా రద్దు చేయాలని  నిర్ణయించింది.

ఉన్న గ్యాస్ సిలిండర్ లనే పొదుపుగా వాడుకోవాలి కాబట్టి  
స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్లైన్ సర్వీస్ ల్లో ఇచ్చే  డిస్కౌంట్ లను రద్దు చేస్తామని హోటల్ యాజమాన్యాల అసోసియేషన్ చైర్మన్ రమణ అన్నారు. తరువాత స్విగ్గీ, జొమాటో లాంటి సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు. అలాగే ప్రతి సోమవారం నాడు హోటళ్లు పూర్తిగా మూసి ఉంచాలని డిసైడ్ అయినట్టు రమణ తెలిపారు. దీనివల్ల రెస్టారెంట్లపై ఒత్తిడి తగ్గి  ఉన్న కమర్షియల్ సిలిండర్‌లనే పొదుపుగా వాడుకునే అవకాశం ఉంటుందని  అభిప్రాయ పడ్డారు. సీఎం చంద్రబాబు, ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసి తమకు సహాయం చేయాల్సిందిగా కోరుతామని అన్నారు. ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలిసి హోటల్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న కష్టాలపై  విజ్ఞప్తి చేస్తామని అన్నారు. ఫుడ్ ఇండస్త్రీ ద్వారా  ప్రభుత్వానికి చాలా ఆదాయం వెళుతున్నా యుద్ధ సమయంలో ప్రధానంగా ఆంక్షలు తమ పైనే విధిస్తున్నారని కమర్షియల్ సిలిండర్లు దొరక్క హోటళ్లు మూతపడుతున్నాయని స్టార్ హోటళ్ల అసోసియేషన్ ప్రెసిడెంట్  స్వామి అన్నారు. కనీసం రేషన్ పద్ధతిలోనైనా హోటళ్లకు సిలిండర్లు సప్లై చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు. యుద్ధం ఎప్పుడు ఆగి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయో తెలియని  అయోమయంలో ప్రపంచం ఉందని దీని ప్రభావం ఎక్కువగా హోటల్ ఇండస్ట్రీ పైన పడటంతో రానున్న రోజుల్లో మరింతగా కష్టాలు పెరిగే ఛాన్స్ ఉందని  ఏపీ హోటల్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

కమర్షియల్‌ గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ హోటల్స్‌ అసోసియేషన్‌.... స్టార్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసరంగా విజయవాడలో సమావేశమైంది. గ్యాస్‌ కొరతతోపాటు పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల పట్ల హోటల్‌ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోతే హోటళ్లను ఎంతకాలం మూసి ఉంచాల్సి వస్తుందనే అంశంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. గ్యాస్‌ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని, అందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అసోసియేషన్ నిర్ణయించింది. కర్ణాటక తరహాలో ఏపీలోనూ కొన్ని హోటల్స్ కేవలం టీ, కాఫీలు మాత్రమే విక్రయించే పరిస్థితి రాబోతోందని హోటల్ యజమానులు పేర్కొన్నారు. రాత్రి 10 గంటల వరకే రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను నడిపేలా సమయం కుదించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని వారు కోరుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos