ప్రభుత్వంపై విశ్వాసంతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ మేరకు ఈ రోజు జరిగిన సీఆర్డీఏ సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సీఆర్డీఏ కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ల త్రిసభ్య కమిటీ సమావేశమైంది.

ఈ సమావేశంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ముఖ్య అధికారులతో పాటు రైతు జేఏసీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు లేవనెత్తిన పలు అంశాలపై చర్చ జరిగింది. వాటి పరిష్కారం కోసం కమిటీ సమాలోచనలు చేసింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై నమ్మకంతో భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగదని చెప్పారు. ఏ రైతుకూ ఇబ్బంది లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ కారణంగా అమరావతిలో అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని చెప్పారు. రాజధానిలో పెండింగ్‌ లో ఉన్న జరీబు భూముల సమస్యకు 30 రోజుల్లో పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ కంఠాలు, లంక భూముల సమస్యలనూ పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అసైన్డ్‌ భూములను అమ్ముకోకుండా జగన్‌ ప్రభుత్వం అడ్డుకుందన్నారు.  రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ భూములకు మిగతా అసైన్డ్ భూములకు వ్యత్యాసం ఉందని, ఈ సమస్యను మూడు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. భూములు ఇచ్చిన రైతుల్లో 90 శాతం మందికి ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, మరో 20 రోజుల్లో డీపీఆర్‌ సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. వచ్చే జూన్‌ నాటికి రాజధాని గ్రామాల్లో తాగునీరు, డ్రెయిన్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos