ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. రెండు గ్రాడ్యుయేట్‌, మరియు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడతారు.  తూర్పు-పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో 63.28 శాతం పోలింగ్ నమోదైందని, కృష్ణా - గుంటూరు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో 65.58 శాతం, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గంలో 91.82 శాతం పోలింగ్ నమోదైందని ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇక  ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరెవరు గెలుస్తారనే అంశంపై విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.

రెండు పట్టబద్రుల ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. కృష్ణా- గుంటూరు పట్టభద్రుల స్థానానికి సంబంధించి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేశారు. ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. పైగా ఆయన సామాజిక వర్గానికి రెండు జిల్లాల్లో మంచి పట్టు ఉంది. పీడీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మణరావు గట్టి పోటీ ఇచ్చినా అధికార పార్టీ ఎదుట నిలువ లేకపోయారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి స్పష్టమైన గెలుపు దిశగా పయనిస్తున్నారని ఆ మూడు పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. అక్కడ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరిలో దిగలేదు. టీడీపీ నుంచి పేరాభత్తుల రాజశేఖర్ బరిలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు తెలిపినా ఫలితం లేకపోయిందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఆస్థానం సైతం కూటమి కైవసం చేసుకుంటుందన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.

మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి గట్టిగానే పోటీ జరిగింది. ఇక్కడ ఏపీటీఎఫ్ వర్సెస్ పీఆర్టీయూ వర్సెస్ యూటీఎఫ్ అన్నట్టు పరిస్థితి మారింది . అయితే టీడీపీ కూటమి అనూహ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మద్దతు తెలిపింది. దీంతో ఆయన గెలుపు తథ్యంగా మారింది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో టీడీపీ కూటమి బలమైన శక్తిగా ఉంది. ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు తెలపడంతో టీడీపీ ఏకతాటి పైకి వచ్చింది. జనసేనతో పాటు బీజేపీ మద్దతు తీసుకుంది. అందుకే ఆ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటును కూడా టీడీపీ కూటమి కైవసం చేసుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos