న్యూస్ : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం తనను కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణంలో ఉన్న ప్రముఖ నాయకుడు సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి కన్నుమూశారనే వార్త తీవ్ర మనోవేదనకు గురి చేసింది. విద్యార్థి కార్యకర్తగా ప్రారంభించినప్పటి నుంచి ఏచూరి గారు ఎల్లప్పుడూ అణగారిన మరియు సామాన్య ప్రజల గొంతుగా ఉండేందుకు కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు మరియు మొత్తం సీపీఎం సోదర వర్గానికి నా హృదయపూర్వక సానుభూతి. ప్రజా సేవ మరియు దేశం పట్ల వారి నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ పోస్టులో పేర్కొన్నారు. సీతారాం ఏచూరి కుటుంబానికి, ఆయన అభిమానులకు, సీపీఎం వర్గానికి సానుభూతిని తెలియజేస్తున్నానని చిరంజీవి చెప్పారు. ప్రజాసేవ, దేశం పట్ల ఏచూరికి ఉన్న నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. మనం గొప్ప నాయకుడిని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos