నెల్లూరు : శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా, ఆత్మకూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రివర్యులు కొలుసు పార్థసారధి గారు ఈరోజు విజయవాడలోని శాప్ కార్యాలయంపై వైసీపీ సైకోలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ఎన్నికల హామీల్లో భాగంగా 16,500టీచర్ పోస్టులను తొలిసంతకం ద్వారా ఇస్తే దాని గురించి జగన్ మర్చిపోయాడు. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో 3శాతం ఉద్యోగాలు క్రీడాకారులకు ఇస్తే దానిపై లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాడు. ఈరోజు విజయవాడ శాప్ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడులు చేయించి అల్లర్లు సృష్టించడానికి జగన్ ప్రయత్నించాడు. వైసీపీ అధికారంలో ఉండగా ఏపీపీఎస్సీ పేపర్లను ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు హాయ్ ల్యాండ్ రిసార్ట్ లో దిద్దారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మరచిపోయారా? పోలీసులు, సంబంధిత అధికారులు లేకుండా ఏపీపీఎస్సీ పేపర్లు దిద్దడంపై కోర్టులు జగన్మోహన్ రెడ్డికి మొట్టికాయలు వేసింది. దానికి సిగ్గుపడకుండా ఉద్దేశపూర్వకంగా మెగా డీఎస్సీపై బురదజిమ్ముతున్నాడు. సొంత ఛానల్, పత్రికలు ఉన్నాయని గంటల తరబడి అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు.
జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? జగన్ తన పాలనలో చేసిన దుర్మార్గాలు బయటపడతాయనే భయంతో అసెంబ్లీకి రావడం లేదు. తాజాగా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కాములో రూ.3,200కోట్లు దోచేసినట్లు సిట్ నివేదికలో తేటతెల్లమైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయాల్లో వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ విషయాలన్నీ ప్రజలకు అర్థం కాకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి మెగా డీఎస్సీపై ఉద్దేశపూర్వక విమర్శలు, దాడులు చేస్తున్నాడని మంత్రి కొలుసు పార్థసారధి జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos