విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌ఓసీ) పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ఆయన కార్యాలయ కార్యదర్శి **ప్రత్తిపాటి శ్రీధర్** కూటమి నేతలతో కలిసి భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు.

 రూ.6.22 లక్షల విలువైన ఎల్‌ఓసీ.. 

35వ డివిజన్‌ డేవిడ్‌ స్ట్రీట్‌కు చెందిన బంకా సతీష్‌ (32) ప్యాంక్రియాటైటిస్‌తో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు రూ.6.22 లక్షల విలువైన ఎల్‌ఓసీ మంజూరు కాగా, పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఊర్మిళ నగర్‌కు చెందిన జీ. కృష్ణారెడ్డి (49)నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు రూ.2.96 లక్షలవిలువైన ఎల్‌ఓసీ మంజూరైంది. లంబాడీపేటకు చెందిన ఉప్పు అరుణకుమారి (50) గర్భాశయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు రూ.1.54 లక్షల విలువైన ఎల్‌ఓసీ మంజూరు చేసి అందజేశారు.

 బ్రెయిన్‌ స్ట్రోక్‌ బాధితురాలికి రూ.7.68 లక్షలు.. 

47వ డివిజన్‌ కేఎల్‌ రావు నగర్‌కు చెందిన గరికే లక్ష్మి (50)బ్రెయిన్‌ స్ట్రోక్‌తో బాధపడుతూ వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు రూ.**7.68 లక్షల** విలువైన ఎల్‌ఓసీ మంజూరు కాగా, పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి వైద్య చికిత్స కోసం ఎల్‌ఓసీ మంజూరుకు చొరవ తీసుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ ఖాదర్, దుర్గమ్మ గుడి ట్రస్ట్‌ బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు, కూటమి నేతలు దుర్బేసుల హుస్సేన్‌, బొల్లేపల్లి కోటేశ్వరరావు, అహ్మద్‌ అలీ, షేక్‌ కరీముల్లా, బుదాల నందకుమారి తదితరులు పాల్గొన్నారు.

 

 

యూట్యూబ్ లైవ్

LIVE : Sports Teachers Protest Against YSRCP | Mega DSC | స్పోర్ట్స్ టీచర్ల పోరాటం | Amaravati Galam

తాజా వార్తలు

18-19-11-0911.jpg

నిరుపేదల వైద్యానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి అండ.. మెరుగైన వైద్యం కోసం బాధితులకు ఎల్‌ఓసీ పత్రాల అందజేత
2026-09-21 Time: 06:19:11

18-02-43-0943.jpeg

శాప్ కార్యాలయంలపై వైసీపీ గూండాల దాడి దుర్మార్గం.. మెగా డీఎస్సీపై ఉద్దేశపూర్వకంగా జగన్ దుష్ప్రచారం.. మంత్రి కొలుసు పార్థసారధి
2026-09-21 Time: 06:02:43

17-51-57-0957.jpg

పచ్చదనం పరిమళం..పిఠాపురంలో నగర వనాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
2026-09-21 Time: 05:51:57

17-16-45-0945.jpg

గురువుల కష్టార్జితంపై ‘ఫేక్’ ముద్ర వేస్తారా? ప్రతి ఆరోపణకూ ఆధారాలతో సమాధానం చెబుతాం.. విజయవాడ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్
2026-09-21 Time: 05:16:45

17-04-22-0922.jpg

స్వర్ణ కుప్పం దిశగా అడుగులు.. పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం
2026-09-21 Time: 05:04:22

Related Videos