ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం పలు రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండోవిడత కింద ఆంధ్రప్రదేశ్‌కు ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండో విడత గ్రాంట్ రూ.420.99 కోట్లతో పాటుగా, మొదటి విడత గ్రాంట్‌లోని రూ.25.49 కోట్లు కలిపి.. రూ.446.49 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. ఏపీలోని 13,097 గ్రామ పంచాయితీలు, 650 మండల పరిషత్‌లు, 13 జిల్లా పరిషత్‌లకు ఈ నిధులు కేటాయించినట్లు పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసిన మేరకు ఏటా రెండు విడతలుగా ఈ గ్రాంట్లను విడుదల చేస్తారు. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ కింద ఈ నిధులను కేటాయిస్తారు. ఆర్థిక సంఘం విడుదల చేసే అన్‌టైడ్ గ్రాంట్లను వేతనాలు మినహా మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చు.

అలాగే టైడ్ గ్రాంట్లను పారిశుద్ధ్యం, ఓడీఎఫ్ పనులు, నీటి నిర్వహణ, వర్షపు నీటి పునర్వినియోగం, వాటర్ రీసైక్లింగ్ వంటి కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను వినియోగిస్తుంటారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఒక విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల అయ్యాయి. సెప్టెంబర్ నెలలో రాష్ట్రంలోని పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.989 కోట్లు విడుదల చేసింది. తాజాగా రెండో విడత నిధులను విడుదల చేసినట్లు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos