విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. పుస్తక మహోత్సవాన్ని నిన్న సాయంత్రం ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించారు. విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చెరుకూరి రామోజీరావు సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్​ మాట్లాడారు. పవన్‌ కళ్యాణ్‌ ఆసక్తిదాయక ప్రసంగం వేలమంది పుస్తక ప్రియుల్ని ఆకట్టుకోవడం విశేషం.

కాగా ఈ బుక్‌ ఫెస్టివల్‌లో సుమారు 270 బుక్‌స్టాల్స్‌ నెలకొల్పారు. మొదటిరోజు ఆధ్యాత్మిక పుస్తకాలే ఎక్కువగా అమ్ముడైనట్లు సమాచారం. హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌లో టాక్‌ ఆఫ్‌ ది బుక్‌ ఫెయిర్‌గా కీర్తి పతాకాన్ని ఎగుర వేసిన తిరుమల శ్రీవేంకటేశ్వరుని అపురూప వర్ణమయ అద్భుత గ్రంథం అదివో - అల్లదివో ... విజయవాడ పుస్తక ప్రదర్శనలోనూ హవా కొనసాగించడం ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ ప్రతిభకు, భక్తి సౌందర్యానికి పరాకాష్టగా నిలిచింది. మొదటిరోజు స్టాల్స్‌ ముగిసే సమయానికి సుమారు 200కు పైచిలుకు పాఠకులు ఈ గ్రంథానికి పట్టం కట్టడం విశేషం. యుగే యుగే, నన్నేలు నాస్వామి, శ్రీపూర్ణిమ, శ్రీమాలిక, అమ్మణ్ణి, శరణు.. శరణు వంటి అనేక విలక్షణ గ్రంథాలతో లక్షణ పాఠకుల్ని సొగసైన సౌందర్యవంతమైన పవిత్రభాషతో ఆకట్టుకున్న పురాణపండ శ్రీనివాస్‌  రచనా సంకలనం అదివో.. అల్లదివో గ్రంథం హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో కూడా వేలకొలది బుక్స్‌ అమ్ముడుపోయి పతాక శీర్షికలకెక్కడం ఒక ప్రత్యేక విశేషంగా పుస్తక విక్రేతలు పేర్కొంటున్నారు. ఇదిలా  ఉండగా ఇప్పుడు జరుగుతున్న ఈ విజయవాడ పుస్తక మహోత్సవం ఈ నెల 12వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు   కొనసాగుతుంది. మూడున్నర దశాబ్దాలుగా విజయవాడలో ఏటా ఈ పుస్తక మహోత్సవం జరుగుతుండడటం విశేషం.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos