వైసీపీ అధినేత జగన్ ఇటీవలే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘డిజిటల్ బుక్’ యాప్.. ఇప్పుడు ఆ పార్టీకే ఇబ్బందికరంగా మారింది. వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఫిర్యాదు చేసేందుకు తీసుకొచ్చిన ఈ వేదికపై, ఏకంగా ఆ పార్టీ మాజీ మంత్రి విడదల రజనిపైనే తొలి ఫిర్యాదు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. తనపై దాడి చేయించారంటూ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఈ ఫిర్యాదు చేశారు. 2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన ఇల్లు, పార్టీ కార్యాలయం, కారుపై అప్పటి మంత్రి విడదల రజిని దాడి చేయించారని రావు సుబ్రహ్మణ్యం ఆరోపించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన నేరుగా వైసీపీ ‘డిజిటల్ బుక్’ యాప్‌ ద్వారా జగన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం, యాప్‌లో ఫిర్యాదు నమోదు కాగానే వచ్చిన కంప్లైంట్ టికెట్‌ను ఆయన మీడియాకు ప్రదర్శించారు.  ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, "మాజీ మంత్రి రజనిపై చర్యలు తీసుకుని, నాకు న్యాయం చేయాలని జగన్‌ గారిని కోరాను. ఈ ఫిర్యాదుపై సరైన విచారణ జరిపిస్తే, జగన్ చెప్పినట్లుగా ఈ యాప్ ద్వారా కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుందని" పేర్కొన్నారు.

టీడీపీ నేతలు తమను వేధిస్తున్న వారి పేర్లను ‘రెడ్ బుక్‌’లో రాస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, వైసీపీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భరోసా ఇస్తూ జగన్ ఈ ‘డిజిటల్ బుక్’ యాప్‌ను ప్రారంభించారు. ఇది కార్యకర్తలకు శ్రీరామరక్ష అని, అధికారంలోకి వచ్చాక ప్రతీ ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు సొంత పార్టీ మాజీ మంత్రిపైనే ఈ యాప్‌లో ఫిర్యాదు అందడంతో, వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos