ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో అరెస్టయి మధ్యంతర బెయిల్ పై ఉన్న వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ఎట్టకేలకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో లొంగిపోయాడు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదన్న కారణంతో మధ్యంతర బెయిల్ పొందిన బోరుగడ్డ అనిల్ గడువు నిన్న సాయంత్రం తో ముగియడంతో అతను లొంగిపోతాడా లేదా అన్నది సర్వత్ర ఉత్కంఠను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో లొంగిపోయాడు .తన తల్లి అనారోగ్యం పేరుతో బెయిల్ పొడిగించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఇక మద్యంతర బెయిల్ ని పొడిగించే ప్రసక్తే లేదని హైకోర్టు కూడా తేల్చి చెప్పింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు రాజమహేంద్రవరం కేంద్రకారాగార సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేయగా, బోరుగడ్డ అనిల్ బుధవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. ఆయన టీడీపీ నేతలను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వారి కుటుంబ సభ్యులను నోటికి వచ్చినట్టు, అనుచితంగా దూషించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే ఆయన ఈ కేసులో అరెస్ట్ అయ్యి కోర్టు రిమాండ్ విధించిన తర్వాత తల్లికి అనారోగ్యం పేరుతో ఇటీవల బెయిల్ పొందాడు. దీనికోసం నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సృష్టించినట్టు పోలీసులు నిర్ధారించారు. నకిలీ పత్రాలతో ఈ నెల 1వ తేదీ వరకు బోరుగడ్డ అనిల్ మద్యంతర బెయిల్ ను పొడిగించుకున్నారు. దీనిని మరో మారు పొడిగించుకోవడానికి ప్రయత్నం చేయగా హైకోర్టు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ పొడిగించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడంతో ఆయన రాజమహేంద్రవరం జైలులో లొంగి పోవాల్సి వచ్చింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos