కాకినాడ పోర్టు యాజమాన్య హక్కుల విషయంలో కొంతకాలంగా జరుగుతున్న వివాదం కీలక మలుపు తిరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు యజమానిగా ఉన్న కేవీ రావును బెదిరించి అధికార పార్టీ నేతలు తమకు అనుకూలమైన అరబిందో సంస్థకు దీన్ని రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కేవీ రావు ఆధ్వర్యంలోని కాకినాడ సీపోర్టు ప్రమోటర్ గా ఉన్న కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థ నుంచి యాజమాన్య వాటాల్ని వైసీపీ ప్రభుత్వ పెద్దలు బెదిరించి తమకు సన్నిహిత సంస్ద అయిన అరబిందో రియాల్టీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అప్పట్లో పోర్టులోని 41.12 శాతం వాటాల్ని కేవలం రూ.494 కోట్లకు బెదిరించి రాయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఐడీ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. ఇలాంటి సమయంలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం అరబిందో సంస్థ గతంలో తాము కేవీ రావు నుంచి తీసుకున్న వాటాల్ని తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిఫలంగా అప్పట్లో తనకు చెల్లించిన సొమ్మును సైతం కేవీ రావు తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. అలాగే గతంలో తన ఆధ్వర్యంలో ఉన్న 8 ఎకరాల కాకినాడ సెజ్ విషయంలో మాత్రం జోక్యం చేసుకోకుండా కేవీ రావు అంగీకరించారు. దీంతో కాకినాడ సెజ్ అరబిందోకే దక్కింది.

మూడురోజుల క్రితం ఈ వాటాల బదిలీ పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే కాకినాడ పోర్టుకు స్టాక్ ఎక్చేంజ్ తో సంబంధం లేకపోవడంతో గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం పూర్తి చేసినట్లు సమాచారం.అయితే దీనిపై ఇరు వర్గాల నుంచి కానీ, ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దీనిపై మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos