సికింద్రాబాద్ జంక్షన్ నుంచి హౌరా జంక్షన్ కు రాకపోకలు సాగించే ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు ఇవాళ భారీ ప్రమాదం తప్పింది. ఏపీలోని శ్రీకాకుళం సమీపంలోకి రాగానే ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు విడిపోయాయి. అదీ మొత్తం రైలు సగానికి విడిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణం మధ్యలోనే ఇలా విడిపోయింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్, సిబ్బంది రైలును నిలిపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సూపర్ ఫాస్ట్ రైలు కావడం, ఇలా మధ్యలో బోగీలు విడిపోవడంతో భారీ ప్రమాదం జరిగినట్లు భావించిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి రైలును ఆపేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

బోగీలకు మధ్య తగిలించే కప్లింగ్ ఊడిపోవడం వల్లే రెండు భాగాలుగా రైలు విడిపోయినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు.శ్రీకాకుళంలోని పలాస సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో తిరిగి బోగీలను జాయింట్ చేసే పనులను రైల్వే అధికారులు ముమ్మరంగా సాగిస్తున్నారు. అనంతరం రైలు తిరిగి బయలుదేరి వెళ్లనుంది. రెగ్యులర్ గా రాకపోకలు సాగించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు ఇలా మధ్యలో కప్లింగ్ ఊడిపోయి బోగీలు ఎందుకు విడిపోయాయన్న దానిపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం ఉందా లేక విద్రోహ చర్య ఉందా అన్నది తేలాల్సి ఉంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos