ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. మూడు పార్టీలు ప్రభుత్వం నడుపుతున్నాయి. అటు కేంద్రం..ఇటు రాష్ట్రంలోనూ మూడు పార్టీలు అధికారంలో భాగస్వాములుగా ఉన్నాయి. మూడు పార్టీలు కలిసి ఉంటూనే ఎవరికి వారు తమ పార్టీ బలం పెంచుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీలో బీజేపీ భవిష్యత్ ప్రణాళికలు.. కేంద్ర సహకారం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆసక్తి కర విశ్లేషణ చేసారు.

ఏపీలో బలోపేతం కావాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం పొత్తులతో ముందుకు సాగుతున్నా రానున్న రోజుల్లో బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయంగా భావిస్తోంది. ఏపీకి కేంద్రం అందిస్తున్న సహకారం పైన పెద్దఎత్తున ప్రచారం చేయాలని పార్టీ నేతలకు ఢిల్లీ నాయకత్వం దిశా నిర్దేశం చేసింది. ఈ నాలుగు నెలల కాలంలో కేంద్రం ఏపీ కోసం తీసుకున్న నిర్ణయాలపైన ప్రత్యేకంగా మార్గ నిర్దేశం చేస్తున్నారు. ఇటు పురందేశ్వరి సైతం కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ అన్ని రాజకీయ పార్టీలకంటే భిన్నమైనదని చెప్పుకొచ్చారు.గతంలో 11కోట్ల సభ్యత్వాన్ని ఆరునెలల్లో చేసామని, ఇప్పుడు 45 రోజుల్లో 22 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేసామని పురందేశ్వరి తెలిపారు.

ఏపీలో రానున్న రోజుల్లో బీజేపీ ఒక బలమైన రాజకీయ పార్టీగా నిలబెట్టేందుకు పని చేస్తున్నామని పురందేశ్వరి వెల్లడించారు. ఏపీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో కేంద్రం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. తాజాగా కేంద్రం అమరావతి కనెక్టివిటీ కోసం రైల్వే నిర్మాణం చేపట్టడం సంతోషకరమని అన్నారు. కాగా రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తుందని, 12,500 కోట్ల రూపాయలు పోలవరం పూర్తి చేయటానికి నిధులు కేటాయిస్తామని పురందేశ్వరి హామీ ఇచ్చారు. 900 కోట్ల పై చిలుకు దెబ్బతిన్న డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎన్డీయే ఉండాలని, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఉండాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

రూ. 2,245 కోట్ల నిధులతో ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 57 కిలోమీటర్లు మేరకు అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్‌ను కేంద్రం మంజూరు చేసిన అంశాన్ని ప్రకటించటం సంతోషంగా వుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహద పడుతుందన్నారు. అమరావతినే రాజధాని అని మొదటి నుంచీ బీజేపీ చెబుతోందని, కేంద్రం కూడా అమరావతి రాజధాని అని మొదటి నుండి ప్రతిపాదిస్తూనే వస్తోందని పురందేశ్వరి అన్నారు. రాజధాని కోసం ప్రత్యేక నిధులు ప్రపంచ బ్యాంకుల నుంచి ఇప్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సింహ భాగం కేంద్రం నిధులు ఇస్తుందన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos