మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అటవీ భూములు ఆక్రమించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలకు పాల్పడినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై ఏపీ సర్కార్ స్పందించింది.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చిన ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అటవీ భూములు ఆక్రమించినవారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. పీసీసీఎఫ్‌ (ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌)తో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు. అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు.

పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని తెలిపారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా..  చేసిన పక్షంలో అందుకు బాధ్యులెవరు.. తద్వారా లబ్ధి పొందింది ఎవరనేది నివేదికలో పేర్కొనాలని కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos