ఏపీలో అధికారం కోల్పోయాక వరుస ఎదురుదెబ్బలు తింటున్న వైసీపీకి మన్నిపల్ ఎన్నికలు మరిన్ని షాకులిస్తున్నాయి. రాష్ట్రంలో తాజాగా జరిగిన డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులు ఎక్కడికక్కడ వైసీపీకి ఓటమి రుచి చూపిస్తున్నారు. అదీ విచిత్రంగా వైసీపీ మెజార్టీ ఉన్న కౌన్సిళ్లలో కూటమి అభ్యర్ధులుగా వరుస విజయాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ తిరుపతి కార్పొరేషన్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది.

తిరుపతి  కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఇవాళ కూటమి అభ్యర్ధి మునికృష్ణ విజయం సాధించారు.  మునికృష్ణకు 26 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్ధి భాస్కర్ రెడ్డికి 22 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎక్స్ అఫీషియో ఓటర్లతో కలిపి మొత్తం 50 ఓట్లు ఉండగా.. ఇందులో కూటమి అభ్యర్ధికి 26, వైసీపీ అభ్యర్ధి 22 ఓట్లు సాధించారు.దీంతో కూటమి అభ్యర్ధి మునికృష్ణ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

వాస్తవానికి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక నిన్న జరగాల్సి ఉండగా కోరం లేక వాయిదా పడింది. నిన్న కొందరు వైసీపీ కార్పొరేటర్ లను టీడీపీ నేతలు బస్సులో నుంచి కిడ్నాప్ చేసి తరలించుకుపోయారు. వీరిని తమ వైపు తిప్పుకున్నారు. దీనిపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేదని నేతలు ఆరోపించారు. నిన్న అర్ధరాత్రి కూడా వైసీపీ, టీడీపీ నేతల మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి. చివరికి ఇవాళ కౌన్సిల్ సమావేశంలో కూటమి అభ్యర్ధికే మెజార్టీ లభించింది. దీంతో మేయర్ గా ఉన్న వైసీపీ నేత శిరీష భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos