ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు బడ్జెట్ కూర్పుపై ఫోకస్ పెట్టారు. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్త పథకాలు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించినందున బడ్జెట్‌లో అందుకు తగ్గ కేటాయింపులపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల అమలుకు ఈ ఏడాది నుంచే శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అటు పథకాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపులు చేయడం సర్కార్‌కు సవాల్‌గా మారింది. సవాళ్లను అధిగమించాల్సిన అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఓవైపు ఆదాయం తగ్గింది. మరోవైపు సంక్షేమ పథకాల భారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ.. బడ్జెట్ రూపకల్పన చేస్తున్నట్టు కూటమి నేతలు చెబుతున్నారు.
కాగా కూటమి ప్రభుత్వం వచ్చాక నూతన ఇసుక విధానాన్ని అమలు చేసింది. దీంతో ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణపై చంద్రబాబు దృష్టి పెట్టారు. పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేస్తోంది. ఇది కొంతమేర ఊరటనిస్తోంది. అయితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక సాయం చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరుతున్నారు. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్లతో నవంబర్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos