ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ముందడుగు వేయబోతోంది. నిర్మాణాలకు శ్రీకారం చుట్టబోతోంది. అమరావతిలో నిర్మాణాలను చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం పునః ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. నేడు సీఆర్డీఏ  భేటీ కానుంది. ఇది 45వ సమావేశం. క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఇప్పటివరకు నిర్మాణ పనులను దక్కించుకున్న ఏజెన్సీలకు అందజేయాల్సిన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పై ఈ భేటీ సందర్భంగా ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.

రాజధాని నిర్మాణ పనులను ఈ నెల 12 నుంచి 14 తేదీల మధ్య ప్రారంభించాలంటూ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకున్నందున ఈ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్‌ను సంబంధిత ఏజెన్సీలకు అందజేయనుంది. ఇవి అందిన వెంటనే నిర్మాణ పనులు మొదలు కావడం ఇక లాంఛనప్రాయమే అవుతుంది. దీని కోసం ప్రపంచ బ్యాంకు నుండి 15,000 కోట్ల రూపాయల మేర రుణం ఇదివరకే మంజూరైంది. ఈ మొత్తం అక్కడి నిర్మాణాలకు ఊతం ఇవ్వనుంది. సీఆర్డీఏ పరిధిలో మొత్తం 90 పనులను చేపట్టనున్నట్లు ఇదివరకే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించిన విషయం తెలిసిందే. వీటిలో మొదటి దశలో 73 పనులకు పరిపాలనపరమైన ఆమోదం లభించింది. ఫలితంగా- ఈ పనులు మొదలు కానున్నట్లు తెలుస్తోంది. దీనికోసం 24,274 కోట్ల రూపాయలు అవసరమౌతాయని అంచనా వేసింది. సీఆర్డీఏ 43వ సమావేశంలో వీటికి ఆమోదం లభించింది కూడా. తొలి విడతలోనే అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్ల పనులు మొదలు కావొచ్చు.

మొత్తంగా 45, 249 కోట్ల పనులకు గతంలో సీఆర్డీఏ అనుమతులు ఇచ్చినట్టయింది. ఇందులో- అసెంబ్లీ భవనానికి రూ. 765 కోట్లు, హైకోర్టు భవనానికి 1,048 కోట్లు, అయిదు ఐకానిక్ టవర్లకు 4,665 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని సీఆర్డీఏ వెల్లడించింది. అలాగే రహదారుల టెండర్ల కోసం మరో రూ.9,699 కోట్లు, ఇతర రోడ్లకు 7, 794 కోట్ల రూపాయలు వ్యయం చేస్తారని సమాచారం. ఈ నిధుల్లో 15,000 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రపంచబ్యాంకు నుంచి రుణంగా తీసుకోనుంది. మిగిలిన మొత్తాన్ని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, హడ్కోల నుంచి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే ఒప్పందాలు కూడా కుదిరాయి. ఈ రుణాల ద్వారా 31,000 కోట్లను ప్రభుత్వం తీసుకోనుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos