ఏపీ ప్రభుత్వం రూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టింది. తొలి సారి ఏపీ బడ్జెట్ మూడు లక్షల కోట్లు దాటింది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. రూ48,340 కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదించారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయమేనని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అచ్చెన్న తెలిపారు. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 22.86 శాతంగా నమోదైందని వివరించారు.
గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించిందని కానీ మా ప్రభుత్వం 2024-25లో రూ.13.09 కోట్లతో 4.30 లక్షల భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించామని వెల్లడించారు. అదేవిధంగా 2025-26లో 6 లక్షల భూసార పరీక్ష పత్రాలు రైతులకు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2025-26లో 41.38 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరాకు చర్యల తీసుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. బడ్జెట్ లో విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు, ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు రూ.40 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ.61.78 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219.65 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు ప్రతిపాదించారు. అదే విధంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలుకు రూ.9,400 కోట్లు ప్రతిపాదించారు.
ఇక..ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. వ్యవసాయ శాఖకు రూ.12,401.58 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఉద్యాన శాఖకు రూ.930.88 కోట్లు, పట్టు పరి శ్రమకు రూ.96.22 కోట్లు, సహకార శాఖకు రూ.239.85 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.1,112. 07 కోట్లు, మత్స్య రంగానికి రూ.540.19 కోట్లు, ఎన్జీ రంగా వర్సిటీకి రూ.507.01 కోట్లు, వైఎస్సార్ వర్సిటీకి రూ.98.21 కోట్లు, ఎస్వీ వెటర్నరీ వర్సిటీకి రూ.154.57 కోట్లు కేటాయించిన ప్రభుత్వం..ఏపీ ఫిషరీస్ వర్సిటీకి రూ.38 కోట్లు, ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి రూ.12,773.25 కోట్లుఉపాధి హామీకి రూ.6,026.87 కోట్లు కేటాయించింది. ఇక.. ఎన్టీఆర్ జలసిరికి రూ.50 కోట్లు కేటాయించగా.. నీటివనరుల శాఖకు రూ.12,903.41 కోట్ల కేటాయింపులు జరిగాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos