రాజధాని అమరావతి పరిధిలో వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయంలో ఈ నెల 15వ తేదీన శ్రీనివాస కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. అ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆలయ నిర్మాణానికి వెంకటపాలెంలో 25 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 2019లో శంకుస్థాపన చేశారు. ఆ తరువాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలయాన్ని నిర్మించింది. 2022లో వైభవంగా ప్రారంభించి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించింది. శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని.. టీటీడీ కార్యనిర్వహణాధికారి జె. శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. శ్రీ‌వారి ఆల‌య ప్రాంగ‌ణంలో ఈ సమావేశం ఏర్పాటైంది. టీటీడీ అద‌న‌పు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌద‌రి, గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి, ఎస్పీ స‌తీష్ కుమార్‌, టీటీడీ అధికారులు ఇందులో పాల్గొన్నారు. శ్రీ‌నివాస క‌ల్యాణంపై అమరావతి గ్రామాల్లో  తిరుమల శ్రీవారి ప్రచార రథం ద్వారా పెద్ద ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు. భ‌క్తుల‌కు ఇబ్బంది త‌లెత్త‌కుండా క‌ల్యాణ‌ వేదిక పరిసరాలలో అవసరమైన గ్యాలరీలు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos