ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘అడవితల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. గిరిజన గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు తప్పాలని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రాయానికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా డుంబ్రిగూడ మండలం, పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామానికి బయలుదేరారు. గిరిజన గ్రామాల అభివృద్ధి నిమిత్తం “అడవి తల్లి బాట” కార్యక్రమానికి పెదపాడు గ్రామంలో శ్రీకారం చుట్టనున్నారు. పీవీటీజీ ప్రాంతాలను కలిపే రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం దుంబ్రిగూడ ఆశ్రమ పాఠశాలలో బహిరంగసభలో పవన్ పాల్గొంటారు. విమానాశ్రయంలో విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్రప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఘన స్వాగతం పలికారు.
8న అంటే రేపు ఉదయం అరకు మండలంలోని సుంకరమిట్ట చేరుకుని పైవంతెనను ప్రారంభించనున్నారు. అనంతరం విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్‌కు చేరుకుని ఎకో టూరిజంపై అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తారు. ఏపీలో పర్యాటకాభివృద్ధి, ఎకో టూరిజానికి ఉన్న అవకాశాలపై అధికారులతో ఆయన చర్చిస్తారు. కాగా గత వైసీపీ ప్రభుత్వ హయంలో గిరిజన గ్రామాలను గాలికి వదిలేస్తే, కూటమి ప్రభుత్వంలో 10 నెలల లోనే రూ.1,000 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. వాటితో గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తూ మహర్దశ తీసుకొస్తున్నారని జనసేన, కూటమి నేతలు చెబుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos