ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అగ్ర కథా నాయకుడు అక్కినేని నాగార్జున ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. తన చిన్న కుమారుడు అఖిల్ వివాహ వేడుకకు ఆహ్వానించారు. అఖిల్, జైనాబ్ రవ్జీల వివాహానికి హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారిరువురు పలు అంశాలపై కాసేపు చర్చించారు. ఇటీవలే ఈ వివాహ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు నాగార్జున. కాగా గత ఏడాది నవంబర్ 26న అఖిల్, జైనాబ్ రవ్జీల నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వీరి పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

జూన్ 6న ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నాయి. ప్రస్తుతం అక్కినేని నాగార్జున సీఎం చంద్రబాబు నాయుడుని కలిసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే అన్నపూర్ణ ఫొటో స్టూడియోలో అఖిల్, జైనబ్ రవ్జీల వివాహం గ్రాండ్‌గా జరగనుందని...ఇందుకు నాగార్జున భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అక్కినేని అఖిల్ పెళ్లాడబోతున్న జైనాబ్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. జైనాబ్ ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్పీ రవద్జీ కుమార్తె. జైనాబ్ భారత్, దుబాయి, లండన్‌లలో పెరిగింది. జుల్పీ రవద్జీ వైసీపీ హయాంలో సీఎం జగన్‌కు సలహాదారునిగా, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలు అందించారు. జైనాబ్ కుటుంబంతో నాగార్జునకు సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. జుల్పీ రవద్జీ కుటుంబానికి అనేక వ్యాపారాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే జైనాబ్‌కు స్కిన్ కేర్‌కు సంబంధించిన ఒక సంస్థ ఉంది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న అఖిల్ - జైనాబ్‌లు.. ఇప్పుడు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. 

జైపూర్ లేదా ఇటలీలో అక్కినేని అఖిల్ పెళ్లి జరిపించే ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్. అక్కినేని నాగార్జున ఇంట్లో జరగబోయే చివరి శుభకార్యం కావడంతో అఖిల్ పెళ్లికి టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు, క్రీడాకరులందరినీ అక్కినేని ఫ్యామిలీ ఆహ్వానించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీస్థాయిలో ఈ పెళ్లి జరగనుందని తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos