కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరులో శుక్రవారం ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అదేవిధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కి, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.  గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. జగన్ అరాచకాల వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర అవస్థలకు గురయ్యారని, ఏ ఒక్క రంగం కూడా అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. చంద్రబాబు వందరోజుల పాలనలో సంక్షేమం అభివృద్ధి పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలందరూ ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. జగన్ పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలన్నీ ఇప్పుడు సీఎం చంద్రబాబు చెక్క దిద్దుకుంటూ వస్తున్నారని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా కసరత్తులు ప్రారంభించారని, ఇప్పటికే కొన్ని హామీలు  అమలులోకి తెచ్చారని ఆయన అన్నారు. కాగా ఈ సందర్భంగా ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాలోని పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకుని తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని  ఆయన విజ్ఞప్తి చేశారు. తనను ఎమ్మెల్సీగా సీటు గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని కోరారు.

అనంతరం అశోక్ బాబు ఇతర టీడీపీ నేతలు మాట్లాడుతూ  ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండు జిల్లాల్లోని పట్టభద్రులందరూ ఆలపాటి రాజాకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని,  ఘనవిజయం అందించాలని కోరారు. ఆలపాటి పట్టభద్రులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, వారి సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి పాటుపడతారని అన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోని పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ఆలపాటి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos