ఏపీలో ఆస్తిపన్ను ( AP property tax) చెల్లింపుదారులకు ప్రభుత్వం ఈసారి ఇచ్చిన ఆఫర్ గడువు మరో ఐదు రోజుల్లో ముగియబోతోంది. మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిలు ఉన్న వారికి ఊరట కల్పిస్తూ ఇప్పటికే పురపాలక శాఖ ఈ ఆఫర్ ను ఇచ్చింది. దీంతో ఇప్పటికే చాలామంది ఈ ఆఫర్ ను వినియోగించుకుని చెల్లింపులు కూడా చేసారు. అయితే మిగిలిన వారు కూడా ఆస్తిపన్ను చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిలు, వాటిపై వడ్డీలు భారీగా పేరుకుపోయాయి. దీంతో ప్రభుత్వం ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆస్తిపన్ను బకాయిలు చెల్లించిన వారికి అప్పటికే విధించిన వడ్డీపై రాయితీ ఆఫర్ చేస్తోంది. మొత్తం విధించిన వడ్డీపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. తద్వారా మొండి బకాయిల్ని వసూలు చేసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. దీని ప్రకారం ఇప్పటికే పలువురు ఆస్తిపన్ను బకాయిదారులు చెల్లింపులు చేస్తున్నారు. ఈ నెల 31 లోగా ఆస్తి పన్ను బకాయిలు చెల్లించిన వారికి వడ్డీలో 50 శాతం రాయితీ ఇవ్వడంతో ఆ గడువు మరో ఐదు రోజుల్లో ముగిసిపోనుంది. అలాగే ఇప్పటికే ఆస్తిపన్ను చెల్లించిన వారికి సైతం సర్కార్ మరో ఊరట ఇచ్చింది.ఇప్పటికే ఆస్తిపన్ను బకాయిల్ని వడ్డీతో చెల్లించిన వారికి తర్వాతి బిల్లులో మినహాయింపు ఇచ్చేలా జీవో 58లో మరో ఆఫర్ ఇచ్చింది. కాబట్టి ఆస్తిపన్నుపై వడ్డీ విధించిన ప్రతీ ఒక్కరికీ ఏదో విధంగా ఊరట కల్పించబోతున్నారు. దీంతో ఇప్పటికే ఆస్తిపన్ను చెల్లించిన వారు, అలాగే ఇంకా చెల్లించాల్సిన వారికీ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చినట్లయింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos