ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) షెడ్యూల్‌ విడుదలైంది. టెట్ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. డిసెంబరు 10 నుంచి పరీక్షలు నిర్వహిస్తుండగా.. జనవరి 19న ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా, ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అక్టోబరు 24 నుంచి అంటే ఈ రోజు నుంచి నవంబరు 23 వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఇక.. డిసెంబరు 10 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబరు 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు. జనవరి 19న ఫలితాలు విడుదల చేయనున్నారు.  ఈసారి టెట్‌లో ప్రధానంగా రెండు కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీ మార్కుల్లో 5 శాతం సడలింపు ఇస్తున్నారు. ఇకపై పూర్తిగా ఎన్‌సీటీఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. 2011 నుంచి టెట్‌ అమల్లోకి వచ్చింది.

ఇక..స్కూల్‌ అసిస్టెంట్‌కు సంబంధించిన 2ఏ, 2బీ పేపర్లు టెట్‌ రాసే అభ్యర్థులకు డిగ్రీలో 50శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45శాతం మార్కులు ఉండాలి. 2011 కంటే ముందు ఉద్యోగాలు పొందిన టీచర్లు కచ్చితంగా టెట్‌ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ మేరకు ఇన్‌-సర్వీస్‌ టీచర్లకు టెట్‌ రాసే అవకాశాన్ని పాఠశాల విద్యాశాఖ కల్పించింది. అయితే ప్రభుత్వ మేనేజ్‌ మెంట్ల టీచర్లకు, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని టీచర్లకు ఇంటర్మీడియట్‌, డిగ్రీలో కనీస మార్కుల నిబంధన వర్తించదు. ఇక 2011 జూలై 29 కంటే ముందు బీఈడీ లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో అడ్మిషన్‌ పొంది ఉంటే వారికి అర్హత మార్కుల శాతంతో సంబంధం లేదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

అదేవిధంగా 2011కు ముందు కోర్సులు పూర్తిచేసిన వారికి సంబంధిత అర్హత కోర్సు (డిగ్రీ, ఇంటర్‌)లో ఓసీలకు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40శాతం మార్కులు ఉండాలి. టెట్‌ నిర్వహణకు పాఠశాల విద్య కమిషనర్‌ నేతృత్వంలో కమిటీని నియమించింది. పరీక్ష ను 150 ప్రశ్నలతో 150 మార్కులకు ఆన్‌లైన్‌ విధానంలో టెట్‌ నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్‌తో పాటు ఎంపిక చేసుకున్న భాషలో ఉంటుంది. టెట్‌లో ఉత్తీర్ణతకు ఓసీలకు 60శాతం, బీసీలకు 50శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు 40 శాతం మార్కులు రావాలి. టెట్‌ సర్టిఫికెట్‌కు జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది. టీఆర్‌టీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఇస్తారని సంబంధిత అధికారులు వివరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos