ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రధానంగా స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో హెలీప్యాడ్​కు సీఎం చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రజావేదికకు బయల్దేరారు. ఎన్​ఎస్​పీ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను చంద్రబాబు పరిశీలించారు. జిల్లాలోని వివిధ మండలాలకు కేటాయించిన స్వచ్ఛ రథాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక, రాబోయే రోజులన్నీ వినుకొండకు మంచి రోజులే, స్వర్ణాంధ్ర- స్వఛ్చాంధ్ర కార్యక్రమం కోసం ఇక్కడకు వచ్చాను. చెత్తనుంచి సంపద సృష్టించడం పట్ల సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.. మండలానికి ఒక స్వచ్చ రథం ఇచ్చాం.. ప్రతి వారం మండలంలో అన్ని గ్రామాలు స్వచ్చ రథం తిరుగుతుందని తెలిపారు.. పల్నాడు అనగానే పౌరుషాల గడ్డ.. కోటప్పకొండ తిరునాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయి. శివరాత్రి ప్రభల కంటే కోటప్పకొండ ప్రభలు ఎంతో ఫేమస్ అని వెల్లడించారు.

మంత్రి నారాయణ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర- స్వఛ్చాంధ్ర కార్యక్రమాలు నడుస్తున్నాయి. నేను సీఎం అయ్యే సమయానికి రాష్ట్రంలో 108 లక్షల టన్నుల చెత్త రాష్ట్రంలో పేరుకుపోయింది. ప్రజలకు స్వచ్చమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. అందుకే ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వఛ్చాంధ్రలో పాల్గొంటానున్నానని వెల్లడించారు చంద్రబాబు.. మార్చి 31 కల్లా వంద శాతం ఇంటి నుంచి చెత్త సేకరించేలా చేస్తాం. చెత్త ద్వారా మళ్లీ వస్తువుల ఉత్పత్తులు చేస్తాం. విశాఖలో చెత్త నుంచి కరెంటు తయారు చేస్తున్నారు. మరో ఐదు ప్లాంట్ల ద్వారా కరెంటు తయారు చేస్తామని అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రాష్ట్రంలో బ్యాన్ చేశాం.. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో పెను మార్పులు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రంలో ఇచ్చినంత పెన్షన్ ఇవ్వడం లేదన్నారు సీఎం చంద్రబాబు. ప్రతి ఎకరాకు నీరు ఇస్తాం. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. అగ్రిటెక్ అందుబాటులోకి తీసుకొచ్చాం. బిల్ గేట్స్ వచ్చి మన టెక్నాలజీ వినియోగం చూసి ఆశ్చర్యపోయారు. వారసత్వంగా వచ్చే పంటలు పండిస్తే లాభాలు రావడం లేదు. ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం పెడుతున్నాం. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు..

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos