విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్' చేపట్టారంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ భూములను కైవసం చేసుకునేందుకే ఈ కుట్ర జరుగుతోందని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ఎంబీ భవన్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. "విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ నాటకాలు ఆడుతోంది. రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు బీజేపీకి వత్తాసు పలుతుకున్నారు. 2021లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు... స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్రానికి లేఖ రాశారు. ఒకప్పుడు వాజ్‌పేయి హయంలో ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటే అడ్డుపడ్డానని ఆయన గొప్పలు చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీజేపీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉందంటే, అది ఆంధ్ర ఎంపీలు ఇచ్చిన మద్దతుతోనే. టీడీపీ, జనసేన బీజేపీతో బహిరంగ పొత్తు పెట్టుకుంటే.. వైసీపీ రహస్య పొత్తు పెట్టుకుంది. స్వార్థ రాజకీయాల కోసం అందరు కలిసి బీజేపీని మోస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంపీల మధ్య ఐకమత్యం లేదు. పార్లమెంట్ వేదికగా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నాం అంటే ఒక్కరు మాట్లాడలేదు. పోలవరం ఎత్తు తగ్గించాం అని చెప్పినా ఐకమత్యం లేదు. ప్రజాస్వామయంగా ఎన్నికైన ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలని" షర్మిల అన్నారు.

"విశాఖ స్టీల్ భూముల విలువ రూ.4 లేదా 5 లక్షల కోట్లు. 20 వేల ఎకరాల కోసం ప్రధాని మోదీ ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ చేపట్టారు. అందుకే రా మెటీరియల్ ఇవ్వడం లేదు... క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు... లాజిస్టిక్స్ ఇవ్వడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోంది. పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ఎంపీలు అందరూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని" వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos