హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత నాంపల్లి కోర్టుకు తరలించగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.  అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించే ముందు.. నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. తొక్కిసలాటకు ప్రత్యక్షంగా సంబంధం లేదని.. తనపై ఉన్న FIR కొట్టి వేయాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదించారు. కేసులో అల్లు అర్జున్ ఏ 11గా ఉన్నాడని..  ఈ విషయంలో ప్రత్యక్షంగా కానీ .. పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం లేదంటూ అల్లు అర్జున్ తరపు లాయర్లు వాదించారు. దీనిపై పోలీసులు సైతం బలంగా వాదనలు వినిపించారు. పోలీసుల అనుమతి లేకుండా థియేటర్ దగ్గరకు వచ్చారని.. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని.. హీరో అల్లు అర్జున్ రావటం వల్లే ఒకరు చనిపోయారని.. దీనికి కారణం అల్లు అర్జున్ అంటూ పోలీసుల తరపు వాదనలు వినిపించారు లాయర్లు.

ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. అంతకుముందు పోలీసులు అల్లు అర్జున్‌కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌పై నమోదైన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసును విత్ డ్రా చేసుకుంటానని తెలిపాడు. అల్లు అర్జున్ ను విడుదల చేయాలని కోరాడు. థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్‌కు సంబంధం లేదని పేర్కొన్నాడు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు తనకు సమాచారం ఇవ్వలేదని... ఆసుపత్రిలో తన మొబైల్ లో న్యూస్ చూస్తూ ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు. తన కొడుకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos