కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి నిర్మాణ పనుల యాక్షన్ ప్లాన్ ను ఖరారు చేసింది. నిలిచిపోయిన రాజధాని కీలక ప్రాజెక్టుల పునరుద్ధరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. డిసెంబర్ 15న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌ క్వార్టర్ల సహా నిర్మాణ పనులన్నీ పునః ప్రారంభం కానున్నాయి. ఈ నిర్మాణాలు తొమ్మిది నుంచి 24 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ నిర్ణయించింది. ఇందు కోసం అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను సీఆర్డీఏకు అప్పగించింది.

అమరావతిలో ముందుగా చేపట్టాల్సిన పనులు..అవి పూర్తి చేయాల్సిన గడువును ఖరారు చేసారు. వచ్చే నెల 15న కీలకమైన పలు భవన నిర్మాణాలు, ఎల్‌పీఎస్‌ ఇన్ర్ఫా పనులను తిరిగి ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌ అధికారుల క్వార్టర్స్‌ పనులను ఆ రోజున ప్రారంభించేలా నిర్ణయం తీసుకున్నారు. రూ.731.30 కోట్ల వ్యయంతో గతంలో టెండర్లు ఖరారు చేసిన ఈ భవనాల నిర్మాణం ఇప్పటి వరకు దాదాపుగా 74 శాతం వరకు పూర్తయింది. వీటిని బహుళ అంతస్థులుగా నిర్మాణం చేయనున్నారు. ఇందు కోసం ఇప్పటికే కాంట్రాక్ట్టు సంస్థకు రూ.380.12 కోట్లు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు.

గతంలో పనులు ప్రారంభించి మధ్యలో నిలిచిన పనులకు సంబంధించి తాజా అంచనాల మేరకు ప్రతిపాదనలు సమర్పించారు. ఈ నిర్మాణాలను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అదేవిధంగా ఎన్జీవో, మంత్రులు, న్యాయమూర్తుల నివాసాల నిర్మాణాలను 15వ తేదీనే తిరిగి ప్రారంభించనున్నారు. వీటిని పూర్తి చేయటానికి తొమ్మిది నెలల సమయం నిర్దేశించారు. గవర్నమెంట్‌ టైప్‌-1, టైప్‌-2 (గ్రూప్‌ డీ), గ్రూప్‌ బీ, గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ క్వార్టర్స్‌ నిర్మాణ పనులు కూడా అదే రోజున ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ నిర్మాణాలు తొలి దశలో రూ.996.05 కోట్ల వ్యయంతో చేపట్టగా 62 శాతం మేర పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

రాజధానిలో మరో కీలక ఘట్టంగా భావిస్తున్న ఎల్‌పీఎస్‌ ఇన్ర్ఫా పనులనూ వచ్చేనెల 15న ప్రారంభించనున్నారు. జోన్‌-1, జోన్‌-2, జోన్‌-3, జోన్‌-4, జోన్‌-5, జోన్‌-6లలో పనులు ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గతంలో 20,482 ఎకరాల విస్తీర్ణంలో 67,912 ప్లాట్లలో రూ.12,629 కోట్ల వ్యయంతో 12జోన్లలోనూ పనులు మొదలు పెట్టారు. తాజా నిర్ణయం మేరకు ఎల్‌పీఎస్‌ ఇన్ర్ఫా పనులను రెండు దశల్లో చేపట్టనున్నారు. ఈ పనులను రెండేళ్ల కాలంలో పూర్తి చేసేలా ప్రభుత్వం డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. దీంతో,  రాబోయే డిసెంబర్ 15 అమరావతి నిర్మాణంలో బిగ్ డే గా నిలవనుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, నిర్మాణరంగ నిపుణులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos