అమరావతి : ఏపీ రాష్ట్ర రాజధాని నగరం అమరావతి అభివృద్ధిలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నవ నగరాలుగా ఉన్న అమరావతి నగరాన్ని 13 జోన్లుగా ప్రభుత్వం విభజించింది. దీనిలో ఆరు జోన్లను ప్రాధాన్యత జోన్లుగా గుర్తించింది. అమరావతి గవర్నమెంటు కాంప్లెక్స్ ఏరియాను రెండు జోన్లుగా విభజించారు. మొత్తం ఆరు జోన్లలో 12,894 ఎకరాలను తొలిదశలో అభివృద్ధి చేయనున్నారు. దీనిలో అమరావతి గవర్నమెంటు కాంప్లెక్స్(ఎజిసి)కి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. . తాజాగా నిర్ణయించిన జోన్ల విధానంలో ఒకటి నుండి 12 జోన్లు ఏర్పాటు చేసి మరొక జోన్ను 12ఏగా పేర్కొన్నారు. నెదర్లాండ్స్ సహకారంతో కాలువలు, రిజర్వాయర్లు నిర్మించాలనుకున్న ప్రాంతమంతా ప్రాధాన్యత జోన్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అభివృద్ధి చేయానుకున్న జోన్లలో 1,2,3,6,7,10జోన్లు ఉన్నాయి. వీటిల్లో ఒకటీ రెండు జోన్లు అనంతవరం, శాఖమూరు పరిధిలో ఉండగా అక్కడ క్రీడా పాలసీని అమలు చేయనున్నారు. ఈ రెండు జోన్లలో కలిపి 4237.34 ఎకరాల పరిధిలో విస్తరించి ఉంది. అలాగే మూడు, ఆరు జోన్లు శాఖమూరు, కొండమరాజుపాలెం, రాయపూడి, లింగాయపాలెం పరిధిలో ఉన్నాయి.

ఇది వాటిల్లో ప్రతిపాదిత ఎజిసి నిర్మించనున్నారు. 4241.57 ఎకరాల పరిధిలో ఈ జోన్లు విస్తరించి ఉన్నాయి. ఏడో జోన్లో లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, మందడం, తాళ్లాయపాలెం, వెంకటపాలెం ఉన్నాయి. ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఇది 2060.13 ఎకరాల్లో ఉంది. 10 జోన్ పరిధిలో నీరుకొండ, ఐనవోలు, కురగల్లు ప్రాంతాలున్నాయి. ఇక్కడ రిజరాయర్లు, విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. పదో జోన్ మొత్తం 2355.52 ఎకరాల పరిధిలో విస్తరించి ఉంది. వీటిల్లో ఆరోజోన్ పరిధిలో పాలవాగు రిజర్వాయర్, పదోజోన్ పరిధిలో కొండవీటివాగు రిజర్వాయర్ నిర్మించనున్నారు. వీటికితోడు అమరావతి సీడ్ డెవలప్మెంట్ ఏరియాను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించారు. త్వరలోనే వీటికి సంబంధించి టెండర్లు పిలవనున్నారు. వీటిల్లోనే శాకమూరు చెరువును కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే నీరుకొండకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో గతంలో మాస్టర్ప్లానులో పేర్కొన్న విధంగా పార్కులు అభివృద్ధి చేస్తామని, ఎజిసికి సమాంతంగా రెండువైపులా పార్కులు వస్తాయని అధికారులు చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos