రాజధాని అమరావతిలో రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సీఆర్డీఏ అథారిటీ అనుమతించిందని మంత్రి నారాయణ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 41వ అథారిటీ సమావేశం జరిగింది. మొత్తం 23 అంశాల అజెండాగా సాగిన భేటీలో మంత్రి నారాయణ, సీఎస్ నీరభ్ కుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు. భేటీ అనంతరం మంత్రి నారాయణ వివరాలు వెల్లడించారు.

సీఆర్డీఏ పరిధిలోని రూ.3,523 కోట్లతో భవనాల నిర్మాణానికి అనుమతి లభించిందని...  రూ.2,498 కోట్లతో రహదారి పనులు, రూ.1,508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు పనులు చేపట్టనున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. 3 రిజర్వాయర్ల నిర్మాణానికి అనుమతించినట్లు పేర్కొన్నారు. రాజధానిలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు భవనాల నిర్మాణం చేపడతామన్నారు. ఈ నెల 15లోపు 5 ఐకానిక్ టవర్లకు డిజైన్లు వస్తాయని.. ఈ నెలాఖరులోపు అవి ఆమోదం పొందితే టెండర్లు పిలుస్తామని చెప్పారు.

అటు, విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్, విజయవాడ మెట్రో రైల్ మొదటి దశ డీపీఆర్‌లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ మెట్రో మొదటిదశలో 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకూ 34.4 కిలోమీటర్ల మేర విశాఖ మెట్రో రైలు ఒకటో కారిడార్‌గా డీపీఆర్‌లో ప్రభుత్వం పేర్కొంది. గురుద్వారా నుంచి పాతపోస్ట్ ఆఫీస్ వరకూ 5.08 కిలోమీటర్ల మేర రెండో కారిడార్.. తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకూ 6.75 కిలోమీటర్ల మేర మూడో కారిడార్ నిర్మాణం చేపట్టాలని సర్కారు నిర్ణయం తీసుకుంది.

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశలో మొత్తం రూ.11,498 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రెండో దశలో 30.67 కిలోమీటర్ల మేర కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ కారిడార్ నిర్మాణం  చేపడతామని మంత్రి నారాయణ వెల్లడించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos