టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కీలక ప్రకటన అమరావతి రైతుల్లో జోష్ తెప్పించింది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రాబోతోన్నది టీడీపీయేనని... ఆ తరువాత... మళ్లీ అమరావతే రాజధానిగా మారబోతోందంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేయడంపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని కాన్సెప్టును నాశనం చేసి... మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడటాన్ని... కేవలం అమరావతి రైతులేకాదు... రాష్ట్రవ్యాప్తంగా అన్నిప్రాంతాల వారు వ్యతిరేకిస్తున్నారు.
అమరావతి రాజధాని నిర్మాణాన్ని జగన్ కొనసాగించి ఉంటే... లక్షల కోట్ల సంపద రాష్ట్రానికి వచ్చుండేది. బంగారుగుడ్లు పెట్టే అమరావతిని జగన్ చేతులారా నాశనం చేశారని... చంద్రబాబు చెప్పడమే కాదు... మెజారిటీ ప్రజల్లోనూ అదే భావం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సరే... అమరావతి సంగతి అలా ఉంచితే... రాజమండ్రి మహానాడులో ప్రకటించిన మొదటివిడత మేనిఫెస్టో ... ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్లి... టీడీపీకి సానుకూల పవనాలు వీస్తుండటాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు.
చంద్రబాబు ఎంతో వ్యూహాత్మకంగా ప్రకటించిన ఆ మేనిఫెస్టోకే .. జగన్ భయపడుతుంటే... ఇక దసరా సందర్భంగా ప్రకటించబోయే రెండో మేనిఫెస్టోలోని హామీలను చూస్తే ఆయన.. ఇంకెంత భయకంపితులవుతారోనని విశ్లేషకులు అంటున్నారు. పైగా... తొలివిడతగా ప్రకటించిన మేనిఫెస్టో లోని హామీలను... టీడీపీకి చెందిన ఐటీడీపీ విభాగం జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతోంది. తొమ్మిది నెలల్లో ఎన్నికలు రాబోతుండటంతో ఆ పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకుని ప్రజల్లోకి దూసుకెళుతోంది.
మరోవైపు వైసీపీ ప్రభుత్వ మంత్రులు అర్థరహితంగా చేస్తున్న కామెంట్స్ కూడా ఆ పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయన్న అభిప్రాయం బలంగా ఉంది. వైసీపీ బలహీనతలు... టీడీపీ బలాల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతాయో చూడాలిమరి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos