వైసీపీ ప్రభుత్వం నిర్యీర్యం చేసిన ప్రాజెక్టుల్లో ఒకటి హ్యాపీనెస్ట్. ఓ అపార్టుమెంట్ కాంప్లెక్స్ లో నిర్మిస్తున్న 1200 ప్లాట్లు గంటలో అమ్ముడు కావడం ఓ చరిత్ర. అలాంటి రికార్డు ఉన్న హ్యాపీనెస్ట్ ను పదేళ్ల పాటు నిర్వీర్యం చేసి.. కొనుగోలుదారులకు భారీగా జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి తెచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చాక వెంటనే ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌గా 14.46 ఎకరాల్లో 12 టవర్లు (G+19 ఫ్లోర్లు) నిర్మిస్తున్నారు. ఇక్కడ 1,200 2 & 3 BHK అపార్ట్‌మెంట్లు ఉంటాయి, మొత్తం ఖర్చు రూ.930 కోట్లు. NCC కంపెనీ కాంట్రాక్టర్‌గా పని చేస్తోంది. సెప్టెంబర్ 2025 నాటికి, ప్రాజెక్ట్ పునఃప్రారంభమై ప్రస్తుతం ఫౌండేషన్ వర్క్ పూర్తవుతోంది. పని వేగంగా జరుగుతోందని ఇంజనీర్లు మానిటరింగ్ చేస్తున్నారు. వేగంగా పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇవ్వాలని సీఆర్డీఏ ప్రయత్నిస్తోంది. హ్యాపీ నెస్ట్ .. రెరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్టు. 

ఇప్పుడు ప్రభుత్వం మారడంతో హ్యాపీ నెస్ట్ ను మళ్లీ పట్టాలెక్కిస్తున్నారు. ఐదేళ్లలో నిర్మాణ విలువ రెండు వందల కోట్ల మేర పెరిగింది. అయినా సరే పాత ధరలకే ప్లాట్లు బుకింగ్ చేసుకున్న వారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హ్యాపీనెస్ట్ బుకింగ్ చేసుకున్న వారికి ఫ్లాట్లు చేతికొచ్చే అవకాశం ఉంది. ఎంతో కొంత ఇస్తాం.. ప్లాట్లు రద్దు చేసుకోవాలని గత ప్రభుత్వం కొనుగోలుదారులను బెదిరించినా.. నలుగురు, ఐదుగురు తప్ప ఎక్కువ మంది రద్దు చేసుకోలేదని తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos