ఏపీ రాజదాని అమరావతికి ఐదేళ్లు పట్టిన వైసీపీ గ్రహణం వీడిపోవడంతో కొత్త ప్రభుత్వం గత వైభవానికి ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకంటోంది. అత్యంత ఆకర్షణీయమైన టూరిజంగా కూడా మంచి ప్లస్ అయ్యే డిజైన్లతో ఐకానిక్ భవనాలు పూర్తి చేయనున్నారు. గతంలో డిజైన్లను ఇంగ్లాండ్ కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్చర్ నార్మన్ ఫోస్టర్స్ కంపెనీ డిజైన్ చేసింది. వాటితో పనులు ప్రారంభమయ్యాయి. హైకోర్టుతో పాటు పరిపాలనా టవర్స్, అసెంబ్లీ భవన నిర్మాణాలకు పునాదులు పడ్డాయి.

అయితే వాటి నిర్మాణాలు ఊపందుకోకముందే ప్రభుత్వం మారింది. అప్పటి నుండి ఎక్కడివక్కడే ఉన్నాయి. అంతేనా … మొత్తం అమరావతితో సంబంధం ఉన్న అందర్నీ వెళ్లగొట్టారు. నార్మన్ ఫోస్టర్స్ తోనూ ఒప్పందాలు రద్దు చేసుకున్నారు. ఫలితంగా అమరావతిని నిర్వీర్యం చేసినంత పని చేశారు. కొత్త ప్రభుత్వం మళ్లీ అందర్నీ సమీకరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వంతో ఏర్పడిన చేదు అనుభవాలను మర్చిపోయేలా చేసి మళ్లీ కలిసి పని చేసేలా ఒప్పందం చేసుకుంటున్నారు. ఇందుకు నార్మన్ ఫోస్ట్స్ అంగీకరించింది.

అమరావతికి నిధుల సమస్య దాదాపుగా పరిష్కారం అయింది. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడమే మిగిలింది. జంగిల్ క్లియరెన్స్ కూడా దాదాపుగా అయిపోయినట్లే. ఐదేళ్ల పాటు పెరిగిన పిచ్చి మొక్కలన్నింటినీ కట్ చేశారు. వాటిని అవసరమైన పరిశ్రమలకు తరలించనున్నారు. డిసెంబర్ నుంచి అమరావతిలో 24/7 పనులు జరగనున్నాయి.

కాగా... వైఎస్సార్సీపీ ప్రభుత్వం నార్మన్‌ ఫోస్టర్‌ వంటి సంస్థల్ని అనేక ఇబ్బందులు పెట్టింది. వారితో సీఆర్‌డీఏ చేసుకున్న అగ్రిమెంట్లను కాలరాసింది. బకాయిలు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టింది. చివరకు బకాయిలు వసూలు చేసుకోవడానికి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇన్ని జరిగిన తర్వాత కూడా నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ మళ్లీ ముందుకు వస్తుందని సీఆర్‌డీఏ ఊహించలేదు. కానీ ప్రీబిడ్‌ మీటింగుకు హాజరవడంతో ఆ కంపెనీగా ఆసక్తిగా ఉందనే విషయం తెలుస్తోంది. ఆ సంస్థ ప్రీబిడ్‌ మీటింగుకు మాత్రమే హాజరైందా లేక బిడ్‌ సైతం దాఖలు చేసిందా అనే విషయంలో ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. అయితే ఆ సంస్థ బిడ్‌ దాఖలు చేసి ఉండి, దానికే టెండరు ఖరారైతే సమయం ఆదా అవుతుందని సీఆర్‌డీఏ అభిప్రాయపడుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos