ఏపీ రాజధాని అమరావతిలో ఆర్-1జోన్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి పనుల్లో భాగంగా ఆర్-1 జోన్‌లో భవనాలు, స్థలాలు కోల్పోతున్న వారికి సీఆర్డీఏ తీపికబురు చెప్పింది. వీరందరి కోసం నెగోషియేటెడ్‌ సెటిల్‌మెంట్‌ పాలసీలో భాగంగా ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు, పరిహారం చెల్లిస్తారు. అయితే ఈ పాలసీలో ప్రభుత్వం కొన్ని అవసరమైన సవరణలు చేసింది. గతంలో ఆర్-1జోన్‌లో ఇళ్లు/భవనాలతో సహా స్థలాలు కోల్పోయిన వారికి.. ఆయా కట్టడాల విలువకు రెట్టింపు పరిహారం ఇచ్చేవారు. అలాగే సీఆర్‌డీఏ స్థలానికి బదులు దాని విస్తీర్ణానికి దగ్గరగా ఉన్న (నియరెస్ట్‌ స్టాండర్డ్‌ ప్లాట్‌) స్థలాన్ని ఎల్‌పీఎస్‌ లేఔట్‌లో ఇచ్చేది. అయితే దీనివల్ల వారందరికి నష్టం జరుగుతోంది.

తాజాగా సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్-1జోన్‌లో ఇళ్లు/ భవనాలు కోల్పోతున్న వారికి.. స్థలానికి సమానంగా విస్తీర్ణంలో స్థలం (ల్యాండ్‌ టు ల్యాండ్‌) కేటాయించేలా నిబంధనలు సవరించి ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్-1జోన్‌లో కోల్పోయిన స్థలం చిన్నది అయితే.. ఒకవేళ ఎల్‌పీఎస్‌ లేఔట్లలో అంత చిన్న స్థలాలు ఇవ్వలేకపోతే మరో నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఇద్దరు ముగ్గురికి కలిపి ఒక స్థలాన్ని కేటాయించేలా వెసులుబాటు కల్పించారు. ల్యాండ్‌ టు ల్యాండ్‌ (స్థలానికి సమానమైన స్థలం) విధానంలో వీరికి గరిష్ఠంగా 3 ప్లాట్ల వరకు పొందే ఛాన్స్ ఉందంటున్నారు. ఒకవేళ వారు స్థలం వద్దని భావిస్తే టీడీఆర్‌ బాండ్‌లూ కూడా తీసుకోవచ్చు. ఆర్-1 జోన్‌లో కమర్షియల్, ఇండస్ట్రియల్ భవనాలు కోల్పోతున్న వారి కోసం మరో నిర్ణయం తీసుకున్నారు. ఆయా కట్టడాల విలువకు రెట్టింపు చెల్లిస్తారు. అంతేకాదు రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో స్థలానికి సమానమైన స్థలాన్ని కూడా ఇస్తారు.

అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే వీటిలో చేపట్టనున్న అంతర్గత పనుల కోసం రూ.980.34 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతుల్ని వేర్వరుగా ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు భవనంలో పనులకు రూ.556 కోట్లు, అసెంబ్లీ భవనంలో పనులకు రూ.424.34 కోట్లు ఇచ్చారు. ఈ నిధులతో ఎలక్ట్రికల్, అగ్నిమాపక వ్యవస్థలు, లిఫ్ట్‌లు తదితర అంతర్గత పనులు చేపడతారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos