రాజధాని అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం.. సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. మరోవైపు ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రజలు, ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకునేలా 9 రహదారులను గుర్తించామని అధికారులు వెల్లడించారు. ఆయా రహదారులపై ఎక్కడా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos