అమరావతి రాజధాని ప్రాంతంలో 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కు అనుమతులు వచ్చాయని, నేటి నుంచి ల్యాండ్ పూలింగ్ పై గ్రామసభలు నిర్వహించనున్నారు. రాజధాని అభివృద్ధి కోసం ప్రభుత్వం బుధవారం నుంచి మరోసారి భూసమీకరణ ప్రారంభించనుంది. తుళ్లూరు మండలంలోని వడ్డమానులో 1,937 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,428 ఎకరాలు అలాగే, పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం 3,361 ఎకరాలు, పెదమద్దూరు 1,145 ఎకరాలు, ఎండ్రాయి 2,166, కర్లపూడి-లేమల్లె 2,944 ఎకరాలుగా సమీకరణ చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 57వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం వివరాలను మంత్రి వెల్లడించారు.

స్మార్ట్ ఇండస్ట్రీస్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీల నిర్మాణం కోసం 7 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియతో ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభిస్తామన్నారు. రెండు వరుసల రహదారులు, అండర్ గ్రౌండ్ కేబుల్స్, వాటర్ లైన్స్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  రైతులకు ఇచ్చే ప్లాట్లు, మౌలిక వసతుల కల్పన తరువాత మిగిలిన 2500 ఎకరాల భూమిలో స్పోర్ట్స్ సిటీ,  రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ కు వినియోగించనున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్ మార్గంలో మంగళగిరి రోడ్ కు కనెక్టవిటీకి మధ్యలో 4.5 ఎకరాల భూమి ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ కు రైతులు ఇవ్వలేదని మంత్రి నారాయణ తెలిపారు. ఫిబ్రవరి లోపు స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుంది. సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం వేగవంతం చేయడంలో భాగంగా ఆ 4.5 ఎకరాల భూమికి భూ సేకరణకు నోటీసులు ఇస్తామన్నారు. నిబంధనల మేరకు ఆ భూమిని ప్రభుత్వం తీసుకునేందుకు చర్యలు తీసుకుంటుంది. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ చేసిన 34వేల ఎకరాల భూమిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 4026 అధికారుల భవనాల నిర్మాణంలో వేగం పుంజుకుందన్నారు. 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు పనులు గడువులోపు పూర్తి చేస్తామన్నారు. 

రాజధాని ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్ అందుకునే వారిలో ఏడుగురు తల్లితండ్రులు లేని మైనర్ లు ఉన్నారు. వారికి పెన్షన్ మంజూరు కు అనుమతి లభించిందని మంత్రి నారాయణ తెలిపారు. వాస్తు ప్రకారం వీధి శూల ఉన్న 112 కమర్షియల్ ప్లాట్స్ కి వెస్ట్ సౌత్ వెస్ట్, సౌత్ సౌత్ వెస్ట్ కి రోడ్డు తగులుతున్నాయో మార్చుకునే వెసులుబాటుపై సీఆర్‌డీఏ అథారిటీ యాక్సెప్ట్ చేసిందన్నారు. ఒకవేళ ప్లాట్ అలాట్ అయిన లబ్ధిదారుడు మరోకరికి ఆ ప్లాట్ ను అమ్మకం చేస్తే వారికి ఈ ప్లాట్ లు మార్చుకునే అవకాశం ఉండదని మంత్రి నారాయణ తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos