ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పోలీసులు ఎప్పుడు, ఎవరికి నోటీసులు ఇస్తారోనన్న టెన్షన్ కొందరి నేతలను వెంటాడుతోంది. ఈ జాబితాలో చాలా మంది వైసీపీ ఫైర్‌బ్రాండ్ నేతలున్నారు. సందర్భాన్ని బట్టి పోలీసులు వారికి నోటీసులు ఇస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. ఆయన అనుచరులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాలంటీర్ల చేత బలవంతపు రాజీనామాలు, లిక్కర్ గోదాంపై దాడి కేసులో పోలీసులు కొడాలి నాని ముఖ్య అనుచరులకు 41 ఏ నోటీసులు ఇచ్చారు. ఇక రేపో మాపో ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారమే నోటీసులు ఇచ్చారు కానీ.. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. నోటీసులు అందుకున్న వారిలో దుక్కిపాటి శశిభూషణ్‌, పాలడుగు రాంప్రసాద్‌, గొర్ల శ్రీను ఉన్నారు. ఈ రెండు ఘటనల్లో కొడాలి నాని, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి జేసీ మాధవీలతారెడ్డిలపై కేసులు నమోదయ్యాయి . నిందితులకు 41ఏ నోటీసులిచ్చి విచారణ చేయాలని ఏపీ హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో నిందితులకు పోలీసులు నోటీసులిచ్చారు.

గుడివాడ లిక్కర్ గోడౌన్‌కు సంబంధించిన కేసు ఇది. గోడౌన్‌ను బలవంతంగా ఖాళీ చేయించారనే ఆరోపణలు కొడాలినానితోపాటు ఆయన అనుచరులపై కేసులున్నాయి. తనను బెదిరించి సరుకును ధ్వంసం చేశారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై వెంటనే కేసులు నమోదు చేశారు. నిందితులుగా అప్పటి ఏపీ బెవరేజేస్ ఎండీ వాసుదేవరెడ్డి , జేసీ మాధవీలతరెడ్డి, కొడాలి నాని, ఆయన అనుచరులు గొర్ల శ్రీను, శశి భూషణ్, రాంప్రసాద్ ఉన్నారు. పోలీసులు అనుచరులను విచారించిన తర్వాత కొడాలి నానికి నోటీసులు ఇచ్చే అవకాశమున్నట్లు  తెలుస్తోంది. నిందితుల విచారణ అనంతరం కొడాలి నానిని అరెస్టు చేస్తారా.. లేదా అనేది చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos