పండిన పంట.. నేలతల్లికి ఎర్రని పట్టుచీర కట్టినట్లు -  ఆరబోసిన మిర్చి రాశులు.. నింగి నుంచి చూస్తే రంగుల హరివిల్లు నేలకు దిగినట్లు..! ఎర్రని తివాచీ పరచిన ఆ పొలాల మధ్య నుండి.. రయ్ రయ్ మంటూ పరుగెత్తే రైలు బండి.. ఆ ఎరుపు కాంతిలో ఒక వెండి వెలుగు రేఖలా! ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. ఏపీ పౌరుషానికి, ఘాటుకు ప్రతీక అయిన గుంటూరు మిర్చి ఇప్పుడు ప్రపంచ పారిశ్రామిక వేదికపై సరికొత్త రంగులు అద్దుకుంటోంది. వైరల్ గా మారిన మిర్చి వీడియోపై.. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా వేసిన ఒక ట్వీట్, దానికి ఏపీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆసక్తికరమైన కౌంటర్ సమాధానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.

ఒకవైపు ఎర్రటి సూర్యుడు, మరోవైపు నేలపైన అంతకంటే ఎర్రగా మెరిసిపోతున్న గుంటూరు మిర్చి రాశులు. ఆకాశం నుంచి చూస్తే అద్భుతమైన ఎర్రటి తివాచీ పరిచినట్లుగా కనిపించే ఈ దృశ్యాన్ని చూసి ఆనంద్ మహీంద్రా పరవశించిపోయారు. హోలీ పండుగ వేళ భారతదేశపు సహజ రంగులను చూపిస్తూ ఆయన చేసిన ట్వీట్, గుంటూరు రైతుల కష్టానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపునిచ్చింది. అయితే, కేవలం ప్రశంసలతో ఆగిపోకుండా, ఈ 'రంగుల లోకాన్ని' ఒక పర్యాటక కేంద్రంగా మార్చవచ్చని ఆయన ఇచ్చిన సలహా ఏపీ పర్యాటక రంగానికి ఒక కొత్త మార్గాన్ని చూపింది. ఆనంద్ మహీంద్రా సూచనలపై ఏపీ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. "ధన్యవాదాలు ఆనంద్ జీ..! మీరు చూస్తున్న ఈ రంగుల దృశ్యం వెనుక వేలాది మంది రైతుల అకుంఠిత దీక్ష, కఠిన శ్రమ దాగి ఉన్నాయి. ఆ శ్రమ వల్లే గుంటూరు నేడు ప్రపంచ మిర్చి ఉత్పత్తి కేంద్రంగా నిలిచింది" అంటూ లోకేష్ రైతులకు క్రెడిట్ ఇచ్చారు. అంతేకాకుండా, మహీంద్రా సూచించిన పర్యాటక అవకాశాలను పరిశీలించాల్సిందిగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను కోరుతానని హామీ ఇచ్చారు. లోకేష్ స్పందన కేవలం పర్యాటకానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన ఈ సందర్భాన్ని రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని హైలైట్ చేయడానికి చాలా చాకచక్యంగా వాడుకున్నారు. "భవిష్యత్తులో ఏపీ నుంచి వచ్చే డ్రోన్ విజువల్స్ కేవలం మిర్చి పంటనే కాదు.. మహీంద్రా ఆటో ఫ్యాక్టరీని, డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్లను, ఏరోస్పేస్ పార్కులను కూడా చూపించాలని నేను కోరుకుంటున్నాను" అంటూ మహీంద్రా గ్రూప్‌ను ఏపీలో పెట్టుబడులకు పరోక్షంగా ఆహ్వానించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos