అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా నిర్వహించిన సమావేశంలో ఒక ఉన్నతాధికారి నిర్వాకం, నిర్లక్ష్యం బయటపడ్డాయి. ఇది కీలమైన సమావేశం కావడంతో కలెక్టర్లు, జిల్లా పోలీసులు, పలువురు అధికారులు హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశంలో.. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా వినతి పత్రాలు ఇచ్చేందుకు పలు సంఘాల నేతలు వచ్చారు. అయితే ఈ సమావేశానికి హాజరైన అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) మలోలా ఆ సమయంలో మొబైల్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఇంతకీ సార్ ఏం చేస్తున్నారనే కదా మీ అనుమానం.. చక్కగా ఆన్ లైన్ రమ్మీ ఆడుకుంటూ కూర్చున్నారు. ఓ వైపు కలెక్టర్ ఇతర అధికారులు సహా అధికారులంతా ముఖ్యమైన సమావేశంలో బిజీగా ఉంటే.. సారు గారు మాత్రం తనకేమీ పట్టనట్లు రమ్మీ ఆడుతూ బిజీ బిజీగా గడిపారు. తన మొబైల్‌లో రమ్మీ ఆడుతూ వేరే ప్రపంచంలో మునిగిపోయినట్లు కనిపించారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా.. డీఆర్వో మలోలా ముఖ్యమైన సమావేశంలో ఇలా రమ్మీ ఆడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సీరియస్‌గా స్పందించారు. సమావేశంలో ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతున్న డీఆర్వో మలోలపై విచారణకు ఆదేశించారు కలెక్టర్. అసలు ముఖ్యమైన సమావేశం జరుగుతుండగా.. ఆన్‌లైన్ రమ్మీ ఎందుకు ఆడాల్సి వచ్చిందనే దానిపై డీఆర్వోను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. ఆయనపై విచారణ చేయాల్సిందిగా జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నివేదిక ఆధారంగా డీఆర్వో మలోలాపై చర్యలు తీసుకుంటామని చెప్పారు కలెక్టర్ వినోద్ కుమార్. ఇలాంటి ఘటనల్ని సహించలేది లేదన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos