వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రంగా మండిపడ్డారు. పిచ్చి జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ గా మారటమే జగన్ 2.0 అని పేర్కొంది. శవం లెగిస్తే కానీ బయటకు రాని దుర్మార్గుడు జగన్.. విజయమ్మ, షర్మిలా ఆయుష్షు గట్టిది కాబట్టే అతడికి దూరంగా ఉంటున్నారు.. జగన్ తీరు మారకుంటే.. గతసారి 11 సీట్లు ఇచ్చిన ప్రజలు.. ఈసారి చొక్కా పట్టుకుని రాష్ట్రం బయటకు గెంటుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడించటం ఒక్కటే ఇక మిగిలి ఉంది.. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని జగన్ ను హెచ్చరిస్తున్నానని మంత్రి సంధ్యారాణి అన్నారు.

ఇక, ఆత్మలతో మాట్లాడే జగన్ మానసిక పరిస్థితి అందరికీ తెలిసిందేనని మంత్రి సంధ్యారాణి వ్యంగ్యంగా అన్నారు. లండన్ లో తెచ్చుకున్న మందులు పని చేయట్లేదని అతడి మానసిక పరిస్థితి చూస్తే అర్ధమవుతోందని ఎద్దేవా చేశారు. జగన్ మానసిక పరిస్థితిని చూసి జాలిపడి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యానికి నేను సిఫార్సు చేస్తానని ఆమె సెటైర్లు వేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ సాయంతోనైనా జగన్ ఓ మంచి డాక్టర్ కు చూపించుకోవాలని సలహా ఇచ్చారు.

పెద్దవాళ్లంటే జగన్‌కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి విమర్శించారు. రూ.20 వేల కోట్లు అప్పు చేసిన పెద్ద మనిషి ఆ డబ్బులతో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూ కంచె వేసుకునేందుకు ఖర్చు పెట్టారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు నిధులన్నీ దారి మళ్లించి వాడేసుకున్న తిమింగలాలని.. ఆఖరికి సర్పంచుల నిధులు కూడా దారి మళ్లించిన ఘనత జగన్‌ది అని సంధ్యారాణి విమర్శలు గుప్పించారు.

అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు పొందగల సైకో జగన్మోహన్ రెడ్డి.. అసెంబ్లీకి వెళ్లి మాట్లాడమని ప్రజలు ఎన్నుకుంటే.. స్పీకర్ చెప్పాలని అంటున్న జగన్ కు పిచ్చి ఏ స్థాయిలో ముదిరిందో అర్ధమవుతోందని మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్ళు బూతులు మాట్లాడిన జగన్ నోట నీతులు విని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.. జగన్ కు విశ్వసనీయత అనే పదం తెలుగులో రాయటం రాదు, ఇంగ్లీషులో అర్ధం తెలీదని మంత్రి సంధ్యారాణి ధ్వజమెత్తారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos