ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు, వెంటనే ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు ఆయన కుమారులు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ జనగాం దగ్గరున్న రేబర్తి అనే గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతం రచించారు.ఈ ఏడాది జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా కోటిరూపాయల నగదు పురస్కారం అందుకున్నారు.

అందెశ్రీ ఆకస్మిక మృతి తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్ కు గురిచేసింది. ఈ విషాదకరమైన వార్తపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ సంతాపం తెలుపుతున్నారు. అందేశ్రీ మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తన ట్వీట్‌లో "ప్రముఖ కవి, రచయిత, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతి కలిగించింది. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ... అందెశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని" సీఎం చంద్రబాబు నాయుడు రాసుకొచ్చారు.

అలాగే మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. :ప్రజాకవి అందెశ్రీ మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. "మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు" అనే పాటతోపాటు ఎన్నో ఉద్యమ గీతాలు రాసిన ప్రజాకవికి హృదయపూర్వక శ్రద్ధాంజలి. సాహిత్యానికి అందెశ్రీ గారు అందించిన సేవలు చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నానని" ట్వీట్ చేశారు. అందెశ్రీ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తం చేశారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన రచనా ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొంటుందని తెలిపారు. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టి అక్షర యాత్ర చేశారని కొనియాడారు. తెలంగాణ జానపదాలపై, మాండలికంపై పట్టు కలిగిన రచయిత అందెశ్రీ పలు సినీ గీతాలు రచించారని ప్రశంసించారు. 'మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు...' గీతం వింటే సమాజాన్ని అందెశ్రీ ఎంతగా చదివారో అర్థమవుతుందని తెలిపారు. 'జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం' అంటూ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించారని కీర్తించారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos