వైసీపీలో చోటామోటా నాయకులే కాదు... ఒకప్పుడు పెద్ద పేరున్న నాయకులు కూడా ఇప్పుడు మొహం చాటేసి... అధినాయకుడు జగన్ కు కనపడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ సందర్భంగా అలాంటి ఒక ప్రముఖ వ్యక్తి గురించి చెప్పుకోవాలి.

అనిల్ కుమార్ అనే ఓ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఉండేవారు. ఆయన వైసీపీ మార్క్ అరాచకానికి, చిల్లర పనులకు ప్రసిద్ధి. అసెంబ్లీలో తొడలు కొట్టడం వంటి పనులు చేసి అందరూ అసహ్యించుకునే లీడర్ అయ్యాడు. ఆయన మాటలు కూడా అదేవిధంగా నీచాతినీచంగా ఉంటాయి. అంత ఓవరాక్షన్ చేసిన ఆ లీడర్ ఇప్పుడు వైసీపీలో అడ్రస్ లేడు. ఓడిపోయిన తర్వాత అసలు కనిపించడం లేదు. పార్టీ కోసం పని చేయడం లేదు. జగన్ కష్టాల్లో ఉన్నా తాడేపల్లి వైపు చూడటం లేదు.

జగన్ రెడ్డి తనను నిండా ముంచాడని అనిల్ కుమార్ అనుకుంటున్నారు. ఆయన కోసం తాను రెచ్చిపోతే తనను తీసుకెళ్లి జిల్లా కాని జిల్లాలో పోటీ చేయించారని. నెల్లూరు రెడ్డి నేతల కోసం తన రాజకీయ భవితవ్యాన్ని బలి చేశారని ఆయన అనుకుంటున్నారు. అలా అని ఆయన వేరే పార్టీల్లో చేరే చాన్స్ లేదు. జగన్ అధికారంలోకి రాక ముందు ఆయన జనసేన నేతలతోనూ టచ్ లో ఉండేవారు. 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అభిమతం మేరకు అనిల్ కుమార్ అందర్నీ బూతులు తిట్టడం ప్రారంభించారు., పవన్ నూ వదల్లేదు. ఫలితంగా ఇప్పుడు జనసేనతోనూ టచ్ కోల్పోయారు.

ఇప్పుడు ఏమైనా అతి చేస్తే కేసుల వల పొంచి ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసినవన్నీ చిల్లర దందాలేనని ... ఇట్టే బయటకు వస్తాయి... అందుకే సైలెంటుగా గా చెన్నైకి వెళ్లిపోయి.. అక్కడే ఉంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎప్పుడైనా నెల్లూరుకు వస్తే .. ఆ వచ్చిన సమాచారం కూడా క్యాడర్ కు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని చెబుతున్నారు. జగన్ రెడ్డి కష్టాల్లో ఉన్నారని ఇప్పుడు అయినా ఆయనకు మద్దతుగా అనిల్ కుమార్ బయటకు రావాలని వైసీపీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆయన ఎలా స్పందిస్తారో మరి చూడాలి.

Related Videos