అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 47 లక్షల 77 వేల మంది రైతులను అర్హులుగా గుర్తించింది. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. లబ్ధిదారుల్లో 98 శాతం మందికి గ్రామ, వార్డు సచివాలయాల సర్వే ద్వారా ఈ కేవైసీ పూర్తయింది. దాదాపు 60 వేల మందికి పెండింగ్ ఉందని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు త్వరలోనే అన్నదాత సుఖీభవ వెబ్ సైట్ అందుబాటులోకి రానుంది.

అన్నదాత పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హత గల రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20,000 ఆర్థిక సహాయం అందుతుంది. సాగు భూమి కలిగిన, అటవీ భూమి సాగుదారు రైతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వపు పీఎం కిసాన్ ద్వారా రూ.6000 ఇస్తుంది. అదనంగా ఏపీ ప్రభుత్వం తన వాటాగా రూ 14000 అందిస్తుంది. మొత్తంగా రైతులకు ఏడాదికి రూ. 20,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాయి.  

అన్నదాత సుఖీభవ పథకానికి సొంత భూమి కలిగిన  పట్టాదారులు, ఇనాం భూములు, అసైన్డ్ భూముల రైతులను అర్హులుగా గుర్తించినట్లు ఢిల్లీ రావు వెల్లడించారు. వెబ్ ల్యాండ్ లో ఆధార్ జత చేయకపోయినా, వివరాలు తప్పుగా ఉన్న రైతులు రెవెన్యూ అధికారిని సంప్రదించి పరిష్కరించుకోవాలని అన్నారు.  ఈ ఏడాది అక్టోబర్ నెలలో, 2026 జనవరిలో రెండు విడతలుగా కవులు రైతులకు అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నగదు అందిస్తామని పేర్కొన్నారు. భూమిలేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర వర్గాల కౌలు రైతులు ఈ పంటలో పేరు నమోదు చేసుకోవడంతో పాటు గుర్తింపు కార్డు పొందాలి. కేంద్రం వాటా నిధులు రాగానే, కూటమి ప్రభుత్వం తమ వాటాతో కలిపి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు.

గత ప్రభుత్వం డీ పట్టాదారులు, ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ సాగుదారులకు రైతు భరోసా వర్తింప జేసింది. కూటమి ప్రభుత్వం వారితో పాటు అసైన్డ్, ఇనాం భూములు, డీ పట్టాదారులు, అందరినీ లబ్ధిదారులుగా చూస్తోంది.  అర్హుల జాబితాలను వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. రైతులు సంబంధిత అధికారులను సంప్రదించి తమ వివరాలు నమోదు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్‌లో https://annadathasukhibhava.ap.gov.in/లోకి వెళ్లి రైతులు తమ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. రైతులు తమ ఆధార్ నంబర్, తరువాత కాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే వివరాలు పొందవచ్చు. సెర్చ్ చేసిన తర్వాత ఈకేవైసీ చేశారో లేదో కూడా తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos