ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసే రోజు.. కేంద్రం ఇచ్చే రూ.2వేలు.. ఏపీ ప్రభుత్వం తన వాటా రూ.5వేలతో కలిపి రూ.7వేలు చొప్పున అకౌంట్‌లలో జమ చేయనుంది. ఇప్పటికే అర్హుల జాబితాను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. రైతుల ఫిర్యాదుల స్వీకరణ రేపు శనివారం నుంచి రైతు సేవా కేంద్రాల్లో ప్రారంభమవుతుందని, ఇవాళ గ్రీవెన్స్ మాడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఏపీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు. వెబ్‌ల్యాండ్‌లో డేటా సరిగా లేకపోతే అన్నదాత సుఖీభవ పథకం, పీఎం కిసాన్ వంటి పథకాలకు అనర్హులు అవుతారని హెచ్చరించారు.

'అన్నదాత సుఖీభవ పథకం కోసం అర్హుల ఎంపిక పూర్తయింది.. అర్హుల వివరాలు పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. రైతులు తమ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, తాము అర్హులమో కాదో తెలుసుకోవచ్చు. రైతులు వ్యవసాయ/ఉద్యాన సహాయకుడిని లేదా వ్యవసాయ అధికారిని కలవవచ్చు.. రైతు సేవా కేంద్రంలో ఫిర్యాదు చేస్తే, సిబ్బంది దానిని పోర్టల్‌లో నమోదు చేస్తారు. అర్హుల జాబితాను పోర్టల్‌లో ఉంచారు. రైతులు ఆధార్ నంబర్ ద్వారా తమ అర్హతను తెలుసుకోవచ్చు. అనర్హులైన రైతులు 155251 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఢిల్లీరావు సూచించారు. ఒకవేళ అర్హత లేనివారు ఉంటే.. ఈ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని అన్నారు. 

మరోవైపు అన్నదాత సుఖీభ పథకానికి తాము అర్హులమో కాదోనని రైతులు తెలుసుకునే అవకాశం ఉంది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చెక్ స్టేటస్ అనే ఆప్షన్‌ ఉంది.. ఈ మేరకు 'ప్రభుత్వ వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in/లోకి వెళ్లి.. అక్కడ చెక్ స్టేటస్ ఆప్షన్‌ ఉంటుంది.. దానిని క్లిక్ చేయాలి. ఈ మేరకు రైతు తన ఆధార్ నంబర్ నమోదు చేసి.. పక్కనే ఉండే కాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు అర్హుల వివరాలు కనిపిస్తాయి. ఆ రైతు ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో, లేదో కూడా తెలుస్తుందని ' అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos