ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ‌ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు రాబోయే కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించి, అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ మేరకు ఆయన పలు విజ్ఞాపన పత్రాలను కేంద్ర మంత్రికి అందజేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రానున్న మూడేళ్లలో రూ.41 వేల కోట్ల ఆర్థిక సహాయం అవసరమని, దీని కోసం వచ్చే బడ్జెట్‌లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చంద్రబాబు కోరారు. అలాగే కరవు పీడిత ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి వరద జలాలను తరలించే పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టును చేపట్టేందుకు ఇప్పటికే జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రాథమిక ప్రాజెక్టు రిపోర్టును కూడా కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించినట్లు తెలిపారు.

‘పూర్వోదయ’, ‘సాస్కీ’ (SASKY) పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలవాలని సీఎం కోరారు. పూర్వోదయ పథకం కింద గ్రామీణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి సహకరించాలని కోరారు. సాస్కీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న యూనిటీ మాల్, గండికోట పర్యాటక ప్రాజెక్టులతో పాటు, కొత్త మౌలిక సదుపాయాల కల్పన కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.10,054 కోట్లు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ కీలక ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యతనివ్వాలని చంద్రబాబు కోరారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos